For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కంటతడి పెట్టుకుంటారు, సినిమా రిలీజై తీరుతుంది: ‘రంగు’ వివాదంపై తనీష్

  |

  త‌నీష్, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం రంగు. కార్తికేయ ద‌ర్శ‌కుడు. న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.

  విజ‌య‌వాడ‌కు చెందిన లారా అనే వ్య‌క్తి జీవితాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. ''లారా అనే రౌడీ షీటర్'' అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలవ్వడంతో లారా బావమరిది దిలీప్, కొందరు స్నేహితులు సినిమాపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సినిమాపై మాకు అభ్యంతరాలున్నాయని, ముందు మాకు చూపించక పోతే సినిమా పోస్టర్ విజయవాడలో పడనివ్వం, రిలీజ్ కానివ్వమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలో 'లారా' పాత్ర పోషించిన తనీష్ స్పందించారు.

   ఆ మాత్రం భయం ఉంటుంది

  ఆ మాత్రం భయం ఉంటుంది

  లారా ఫ్రెండ్స్, బావమరిది చేస్తున్న ఆందోళన గురించి విన్నాను. తమ కుటుంబంలోని ఒక వ్యక్తిపై సినిమా వస్తుంటే... ఎలా చూపించారో? తప్పుగా చూపించారా? ఒప్పుగా చూపించారా? అనే భయం ఉంటుంది. ఆ స్థానంలో నా ఫ్యామిలీ ఉన్నా అలాంటి భయమే ఉంటుంది... అని తనీష్ వ్యాఖ్యానించారు.

  సమాజంలో మనిషి ఎలా ఉండాలి? ఎలా ఉండ కూడదు?

  సమాజంలో మనిషి ఎలా ఉండాలి? ఎలా ఉండ కూడదు?

  ‘రంగు' సినిమాలో పవన్ కుమార్ అలియాస్ లారా... అనే పాత్రలో నటించాను. దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. మనిషి సమాజంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనేది ఇందులో చూపించాం. లారాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సినిమాలోని పాత్ర కోసం తీసుకోవడం జరిగింది.

  నా కళ్లలో నీళ్లు తిరిగాయి

  నా కళ్లలో నీళ్లు తిరిగాయి

  లారా ఐడియాలజీ, ఆలోచన విధానం నేను పర్సనల్ గా అర్థం చేసుకున్నాను. అతడి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్ చాలా స్టడీ చేశాను. అతడి 19 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వరకు జరిగిన సంఘటనలు నేను పోషించిన పాత్ర ద్వారా ఫోకస్ చేయడం జరిగింది. అతడి జీవితంలోని 4 దశలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి, మేము ఈ సినిమా ద్వారా చూపించింది కూడా అదే అని తనీష్ తెలిపారు.

  సినిమా రిలీజై తీరుతుంది

  సినిమా రిలీజై తీరుతుంది

  ఎంత నిజాలు చెబుతున్నామో? ఎంత నిక్కచ్చిగా చెబుతున్నామో సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను ఒకటే చెబుతున్నాను.... ఎవరైతే సినిమా చూపించమని అడిగారో వారికి తప్పకుండా చూపిస్తాం. వాళ్లు కూడా సినిమా చూసి కళ్లలో నీళ్లతో బయటకు వస్తారు. పోస్టర్ పడనివ్వం, సినిమా రిలీజ్ అవ్వనివ్వం అన్నారు. పోస్టర్ పడుతుంది, నవంబర్ 23న సినిమా రిలీజ్ అవుతుంది... అని తనీష్ స్పష్టం చేశారు.

  లారా కుటుంబ సభ్యుల అభ్యంతరం ఇదే...

  లారా కుటుంబ సభ్యుల అభ్యంతరం ఇదే...

  ‘‘లారా అనే రౌడీ షీటర్'' అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లారా మీద రౌడీ షీట్ అన్యాయంగా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదుకు కుంటున్నారు. ఈ సినిమా ఎఫెక్ట్ వారి మీద పడుతుందనే మా భయం. ఇప్పుడు ఆ సినిమా ముందు మాకు చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. మా అంగీకారంతోనే సినిమా రిలీజ్ చేయాలి. లేదంటే సినిమా రిలీజ్ ని లీగల్ గా అడ్డుకుంటామని తెలిపారు.

   మా అనుమతి తీసుకోలేదు

  మా అనుమతి తీసుకోలేదు

  ఒకరి జీవితంపై సినిమా తీస్తున్నపుడు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి. కానీ ‘లారా' కుటుంబ సభ్యులను సంప్రదించకుండానే ‘రంగు' సినిమా తీశారని ఆందోళన వ్యక్తం చేశారు.

  English summary
  Hero Tanish responds on Rangu Movie Controversy. Rangu featuring actors Tanish, Priya Singh in the lead roles. The film is directed by Karthikeya. V and produced by Padmanabha Reddy, Nalla Ayyanna Naidu. The music of the film is composed by Yogeswara Sharma. The film script is based on true story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X