దేవినేని మూవీ కలెక్షన్లు.. తారకరత్న సినిమా పెట్టుబడి ఎంత? వసూలు చేసింది ఎంత?
నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ తనదైన శైలిలో క్రేజ్ అందుకోగా జూనియర్ ఎన్టీఆర్ మరో లెవెల్లో తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో డిఫరెంట్ కథలతో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కానీ మరో హీరో తారకరత్న మాత్రం ఇంకా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవడం లేదు. రీసెంట్ గా తారకరత్న చేసిన ఒక సినిమా కలెక్షన్స్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

మొదట్లోనే వరుసగా 7సినిమాలు
నందమూరి నట వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తారకరత్న మొదటి సినిమా రిలీజ్ కాకముందే వరుసగా ఏడు సినిమాలను ఒకే చేసినట్లు అప్పట్లో గాసిప్స్ చాలానే వచ్చాయి. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేశాడు.

నెగిటివ్ పాత్రలో కనిపించి
తారకరత్న ఒకే చేసిన కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. అయితే 2006 వరకు షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఈ హీరో మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి తనకు తాను కొత్తగా కనిపించాలని అనుకున్నాడు. రవిబాబు దర్శకత్వంలో చేసిన అమరావతి సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించి మొదటిసారి అవార్డులను కూడా అందుకున్నాడు.

ఆ సినిమా బడ్జెట్ ఎంత
సక్సెస్ ఫెయిల్యూర్స్ ను లెక్క చేయకుండా ఎదో ఒక రకంగా సినిమాల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్న తారకరత్న ఇటీవల దేవినేని అనే ఒక సినిమా చేశాడు. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందింది. 40లక్షలతోనే నిర్మించారని టాక్ వస్తోంది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి తేలేదని సమాచారం.

చివరికి వచ్చింది ఎంతంటే?
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలయ్యింది. మధ్యలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కాంట్రవర్సీ న్యూస్ లు కూడా బాగానే వైరల్ అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. మొత్తంగా 6లక్షల షేర్స్ వచ్చి ఉండవచ్చని సమాచారం. మరి తారకరత్న భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సినిమాలతో వస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











