Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లాభాలే లాభాలు: ‘టాక్సీవాలా’ 3 డేస్ కలెక్షన్స్
Recommended Video
విజయ్ దేవరకొండ హీరోగా కొత్త డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సీవాలా' బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. సోమవారంతో బాక్సాఫీస్ వద్ద 3 డేస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది.
టాక్సీవాలా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.5 కోట్ల గ్రాస్ సాధించిన ఈ హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్.... నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి తిరగొచ్చేలా చేసింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 25 కోట్లకుపైగా వసూలైనట్లు తెలుస్తోంది.
ఏపీ- తెలంగాణ షేర్... అన్నీ లాభాలే
ఏపీ తెలంగాణల్లో కలిసి మూడు రోజుల్లో రూ. 8.35 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిన్న బడ్జెట్ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు రెండో రోజు నుంచే లాభాలు ఆర్జిస్తున్నారు. ఇకపై వసూలయ్యే కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయని టాక్.
ఏరియా వైజ్ షేర్
ఈ చిత్రం నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, కృష్ణలో రూ. 65 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 71 లక్షలు, వైజాగ్‌లో రూ. 95 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
యూఎస్ఏలోనూ వసూళ్లు అదరగొడుతోంది
మరో వైపు అమెరికాలోనూ ‘టాక్సీవాలా' మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. 3 రోజుల్లోనే దాదాపు హాఫ్ మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు సమాచారం. విజయ్ గత చిత్రాలు గీత గోవిందం, అర్జున్ రెడ్డి చిత్రాలు సైతం అమెరికాలో సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించాయి.
|
కర్నాటకలోనూ డిమాండ్ అదుర్స్
మన పొరుగురాష్ట్రం కర్నాటకలోనూ ఈ చిత్రానికి డిమాండ్ అదిరిపోతోంది. రెండో రోజు నాటికే రూ. 1.49 కోట్లు రాబట్టింది. ఇప్పటికే అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోకి వెళ్లింది.