twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాభాలే లాభాలు: ‘టాక్సీవాలా’ 3 డేస్ కలెక్షన్స్

    |

    Recommended Video

    Vijay Devarakonda's Taxiwaala 3 Days Collections

    విజయ్ దేవరకొండ హీరోగా కొత్త డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సీవాలా' బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. సోమవారంతో బాక్సాఫీస్ వద్ద 3 డేస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది.

    టాక్సీవాలా మూవీ రివ్యూ అండ్ రేటింగ్టాక్సీవాలా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.5 కోట్ల గ్రాస్ సాధించిన ఈ హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్.... నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి తిరగొచ్చేలా చేసింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 25 కోట్లకుపైగా వసూలైనట్లు తెలుస్తోంది.

     ఏపీ- తెలంగాణ షేర్... అన్నీ లాభాలే

    ఏపీ- తెలంగాణ షేర్... అన్నీ లాభాలే

    ఏపీ తెలంగాణల్లో కలిసి మూడు రోజుల్లో రూ. 8.35 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిన్న బడ్జెట్ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు రెండో రోజు నుంచే లాభాలు ఆర్జిస్తున్నారు. ఇకపై వసూలయ్యే కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తాయని టాక్.

    ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్

    ఈ చిత్రం నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్లో రూ. 1.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, కృష్ణలో రూ. 65 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 71 లక్షలు, వైజాగ్‌లో రూ. 95 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    యూఎస్ఏలోనూ వసూళ్లు అదరగొడుతోంది

    యూఎస్ఏలోనూ వసూళ్లు అదరగొడుతోంది

    మరో వైపు అమెరికాలోనూ ‘టాక్సీవాలా' మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. 3 రోజుల్లోనే దాదాపు హాఫ్ మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు సమాచారం. విజయ్ గత చిత్రాలు గీత గోవిందం, అర్జున్ రెడ్డి చిత్రాలు సైతం అమెరికాలో సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించాయి.

    కర్నాటకలోనూ డిమాండ్ అదుర్స్

    మన పొరుగురాష్ట్రం కర్నాటకలోనూ ఈ చిత్రానికి డిమాండ్ అదిరిపోతోంది. రెండో రోజు నాటికే రూ. 1.49 కోట్లు రాబట్టింది. ఇప్పటికే అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోకి వెళ్లింది.

    English summary
    According to the traders report, Taxiwaala has collected Rs 8.35 Cr shares at the box office of both Telugu States- Andhra Pradesh and Telangana after the successful run of 3 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X