‘టాక్సీవాలా’ సంచలనం... తొలి రోజే పెట్టుబడి రాబట్టింది!
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన 'టాక్సీవాలా' బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. తొలి రోజు వసూళ్లతోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టడం విశేషం.
కలెక్షన్స్ వివరాలు ప్రకటిస్తూ నిర్మాత ఎస్ఎకెఎన్ ట్వీట్ చేశారు. తొలి రోజు ఈ చిత్రం రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించారు. లీక్ వ్యవహారంతో నిన్నటి వరకు డల్‌గా ఉన్న టాక్సీవాలా టీమ్... సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, కలెక్షన్లు అదిరిపోతుండటంతో హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయారు.
ఎస్‌కెఎన్ ట్వీట్
బాక్సీఫీస్ ఈస్ట్ సైడ్ విజయ్ దేవరకొండ, వెస్ట్ సైడ్ యూవి క్రియేషన్స్, సౌత్ సౌడ్ గీతా ఆర్ట్స్, నార్త్ సౌడ్ టెక్నీషియన్స్..... అన్ని వైపుల నుంచి అదరించే ఆడియన్స్‌తో మేము మరోసారి సాధించాము. తొలి రోజు పెట్టుంబడి తిరిగొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూలైంది అని నిర్మాత ఎస్కేఎన్ ట్వీట్ చేశారు.

ఎక్కడ ఎక్కువ వసూలైంది
‘టాక్సీవాలా' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 6 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది. యూఎస్ఏలో రూ. 2 కోట్లు, కర్నాటకలో రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు అదిరిపోవడం ఖాయం అంటున్నారు.

వాటితో పోల్చుకుంటే తక్కువే...
అయితే ఓపెనింగ్స్ పరంగా... విజయ్ దేవరకొండ గత చిత్రాలు ‘గీత గోవిందం', ‘నోటా' చిత్రాలతో పోలిస్తే ‘టాక్సీవాలా' ఓపెనింగ్స్ తక్కువగానే ఉన్నాయని చెప్పక తప్పదు. గీత గోవిందం తొలి రోజు రూ. 16.40 కోట్లు రాబట్టగా... నోటా రూ. 14 కోట్లు వసూలు చేసింది.

అమర్ అక్బర్ ఆంటోనీ రికార్డ్ బద్దలు
రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ'.... టాక్సీవాలా కంటే ఒక రోజు ముందు విడుదలైంది. రవితేజ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 6.70 కోట్లు రాబట్టింది. అయితే టాక్సీవాలా ఈ చిత్రాన్ని ఈజీగా అధిగమించింది.


Click it and Unblock the Notifications











