Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డబుల్ ప్రాఫిట్స్: ‘టాక్సీవాలా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'టాక్సీవాలా' చిత్రం బాక్సాఫీసు వద్ద జోరుగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.
తొలి రోజే రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించిన సంగతి తెలిసిందే. రెండో రోజు నుంటే లాభాల బాట పట్టింది. వారం తిరిగేలోపు డబుల్ ప్రాఫిట్స్ సాధించింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గ్రాస్... రూ. 30 కోట్లకు చేరువైనట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.65 కోట్ల షేర్
టాక్సీవాలా చిత్రం తొలివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.65 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలూ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాను కొనుగోల చేసిన ప్రతి ఒక్క బయ్యర్ డబుల్ ప్రాఫిట్స్ తమ ఖాతాలో వేసుకున్నట్లయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ షేర్
నైజాంలో రూ. 6.05 కోట్లు, సీడెడ్ రూ. 1.35 కోట్లు, ఉత్తరాంధ్ర: రూ. 1.46 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 75 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 65 లక్షలు, గుంటూరు రూ. 90 లక్షలు, కృష్ణ రూ. 88 లక్షలు, నెల్లూరు రూ. 31 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రూ. 12.35 కోట్ల షేర్ రాబట్టింది.
బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవర జోరు.. మూడోస్థానంలో దూసుకెళ్తున్న టాక్సీవాలా!
ఓవర్సీస్లో కలెక్షన్ల జోరు
ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో 700K డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ అన్ని ఏరియాల్లో కలిపి రూ. 2.40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు సమాచారం.
2.0 వచ్చే వరకు అదే హవా
కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో కూడా మంచి వసూళ్లు సాధించింది ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో రూ. 1.90 కోట్ల షేర్ రాబట్టింది. రజనీకాంత్-అక్షయ్ కుమార్ మూవీ 2.0 నవంరబ్ 29న విడుదల కాబోతోంది. అప్పటి వరకు ‘టాక్సీవాలా' జోరు కొనసాగే అవకాశం ఉంది.