‘టాక్సీవాలా’ బాక్సాఫీస్ జర్నీ క్లోజ్... టోటల్ కలెక్షన్ ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'టాక్సీవాలా' బాక్సాఫీస్ జర్నీ ముగిసింది. విడుదల ముందే సినిమా లీక్ అవ్వడం లాంటి సమస్యను ఎదుర్కొన్నప్పటికీ ... కంటెంట్ బావుండటం, దర్శకుడు సినిమా నడించిన విధానం నచ్చడం, విజయ్ దేవరకొండ, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగా పేలడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు నిరాజనం పట్టారు.
రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 17 ఈ సినిమా విడుదలవ్వగా మంచి విజయం అందుకుంది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడింది. విజయ్ కెరీర్లో 'గీత గోవిందం', 'అర్జున్ రెడ్డి' తర్వాత హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా 'టాక్సీవాలా' నిలిచింది.

వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ షేర్
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... దాదాపు అన్ని ఏరియాల్లో టాక్సీవాలా బాక్సాఫీస్ రన్ ముగిసింది. ఓవరాల్‌గా రూ. 21.28 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. సినిమాను కొనుగోలు చేసిన అందరికీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

ఎంతంటే ఏరియా వైజ్
నైజాం రూ. 7.70 కోట్లు, సీడెడ్ రూ. 1.65 కోట్లు, వైజాగ్ రూ. 1.85 కోట్లు, ఈస్ట్ రూ. రూ. 95 లక్షలు, వెస్ట్ రూ. 80 లక్షలు, కృష్ణ రూ. రూ. 1.15 కోట్లు, గుంటూరు రూ. 1.13 కోట్లు, నెల్లూరు రూ. 45 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 2.60 కోట్లు, ఓవర్సీస్ రూ. 3 కోట్ల షేర్ వసూలు చేసింది.

విడుదల తర్వాత మారిన పరిస్థితులు
సినిమా విడుదల ముందే లీక్ అవ్వడంతో.... రిలీజ్ ముందు రోజు వరకు నిర్మాత ఎస్కేఎన్ కాస్త ఆందోళనగానే కనిపించారు. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మంచి వసూళ్లు సాధించింది.

విజయ్ దేవరకొండ
కాగా... విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రెడ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉంది. కాకినాడలో ఇటీవల షూటింగ్ జరుగుతుండగా విజయ గాయపడ్డారు. అయితే చిన్నగాయమే కావడంతో షూటింగ్ కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











