166 కోట్ల బడ్జెట్.. 7 కోట్ల కలెక్షన్లు.. ఇండియాలో డిజాస్టర్‌గా నిలిచిన సినిమా గురించి తెలుసా?

హాలీవుడ్‌లో సింగర్, లిరిక్ రైటర్ టైలర్ స్విఫ్ట్ అలియాస్ టైలర్ అలిసన్ స్విఫ్ట్ మ్యూజిక్ రంగంలో సెన్సేషన్ అనే విషయాన్ని కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ కాన్సెర్ట్‌తో ఈవెంట్లను నిర్వహిస్తుంటారు. 2023లో ఆమె నిర్వహించిన మ్యూజిక్ టూర్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ అయింది. అయితే డిస్కోగ్రఫీగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

టైలర్ స్విఫ్ట్ ది ఎరాస్ టూర్ (Taylor Swift The Eras Tour) సినిమాకు సంబంధించి భారీ బడ్జెట్‌తోనే రూపొందించారు. ఈ సినిమాకు పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ఇండియాలో ఈ మూవీ వచ్చిందనే విషయం కూడా సాధారణ ప్రేక్షకులు, రెగ్యులర్ ఆడియెన్స్ దృష్టికి రాలేకపోయింది. దాంతో ఇండియాలో పేలవంగా వసూళ్లు నమోదు అయ్యాయి.

Taylor Swift The Eras Tour closing Collections in India

లెజెండరీ సింగర్ టైలర్ స్విఫ్ట్ కనిపించిన టైలర్ స్విఫ్ట్ ది ఎరాస్ టూర్ (Taylor Swift The Eras Tour) సినిమాను సుమారుగా 20 మిలియన్ల డాలర్లతో అంటే ఇండియన్ కరెన్సీలో 166 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రధాన నగరాల్లో మల్టీ‌ప్లెక్స్ హాల్స్‌లో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమైంది.

టైలర్ స్విఫ్ట్ ది ఎరాస్ టూర్ (Taylor Swift The Eras Tour) సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు పెద్దగా స్పందన కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక అమెరికాలో ఈ సినిమాకు మంచి స్పందన కనిపించింది. యూఎస్‌లో తొలివారాంతం 150 మిలియన్లు, ఓవర్సీస్‌లో 65 మిలియన్ల కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా తొలి వారంలో 230 మిలియన్ డాలర్ల వసూలు చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటింది.

Taylor Swift The Eras Tour closing Collections in India

ఇక ఇండియాలో టైలర్ స్విఫ్ట్ ది ఎరాస్ టూర్ (Taylor Swift The Eras Tour) సినిమాకు పేలవంగా వసూళ్లు నమోదయ్యాయి. తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 10 లక్షలు, 5వ రోజు 10 లక్షలు, 6వ రోజు 10 లక్షలు, ఏడో రోజు 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 7 కోట్ల రూపాయలు రాబట్టింది.

సింగర్ టైలర్ స్విఫ్ట్‌కు ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేయలేకపోవడం ఒకటి. డిస్కోగ్రఫికి పెద్దగా జనాదరణ లేకపోవడం వల్ల పేలవంగా కలెక్షన్లు నమోదు అయ్యాయనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X