పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్టు
పవన్ కళ్యాణ్, త్రిష కాంబినేషన్ లో జయంత్ పరాంన్జీ రూపొందించిన తీన్ మార్ చిత్రం రికార్డు స్ధాయిలో 1150 ధియోటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజిలో ఉండి అదరకొట్టాయి. ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది కోట్ల నలభై లక్షలు వసూలు చేసింది. అలాగే వరల్డ్ వైడ్ పదకొండు కోట్లు వసూలు చేసింది. ఒక్క నైజాంలోనే రెండు కోట్ల 17 లక్షలు వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాత గణేష్ ధృవీకరిస్తున్నారు. ఇక హైదరాబాద్ ప్రసాద్ ఐ మాక్స్ లో మొత్తం ముప్పై షోలు పడ్డాయి.దాంతో అక్కడా మంచి షేర్ వసూలు అయిందని చెప్తున్నారు.అలాగే దాదాపు 26 కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే రోజే 30% పైగా వసూలు చేయటంతో అంతా రిలాక్సడ్ గా ఉన్నారు. దానికి తోడు ఎక్కడా నెగిటివ్ టాక్ రాకుండా ఉండటం కూడా చిత్రానికి ప్లస్ అయింది. ఈ వారాంతానికి ఇదే హవా కొనసాగితే ముప్పై కోట్ల వరకూ వసూలు చేసే అవకాసం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు.


Click it and Unblock the Notifications











