HanuMan Collections: యూఎస్ఏలో హనుమాన్ సంచలనం.. మహేష్, ప్రభాస్ తరహాలోనే తేజ సజ్జా రికార్డు

టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. గుంటూరు కారం లాంటి సినిమాకు ఈ సినిమా పోటీగా సంక్రాంతి బరిలోకి దిగి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు యూఎస్ఏలోనూ సంచలనం క్రియేట్ చేస్తుంది. రోజున్నరలోనే హనుమాన్ చిత్రం అమెరికాలో రికార్డు వసూళ్లు రాబట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇక మన పురాణాల్లోని హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో కథగా ఈ సినిమాను రూపొందించారు. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అమృత అయ్యర్, గెటప్ శీను, వెన్నెల కిషోర్, సత్య, వినయ్ రాయ్ ఈ సినిమాలో కీ రోల్ పోషించారు. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉండగా సినిమా రిలీజయ్యాక పాజిటివ్ టాక్ రావడంతో భారీ విజయం దిశగా దూసుకుపోతుంది.

 Teja Sajja Prashanth Varma Hanuman Movie Record Collections in USA Full Details Here

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా రచ్చరేపుతుంది. సంక్రాంతి పండగ మూడు రోజులు బుకింగ్స్ కూడా అయిపోయాయని తెలుస్తోంది. విడుదలకి ముందు రోజు దాదాపు 1000 షోలు ప్రీమియర్స్ వేయగా దాని నుంచి కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయనే విషయం తెలిసిందే. అన్ని చోట్ల భారీ విజయం సాధించిన హనుమాన్ కలెక్షన్స్ కూడా భారీగా వసూళ్లు రాబడుతుంది.

ఇక తాజాగా ఈ హనుమాన్ చిత్రం యూఎస్ఏలోనూ హవా సాగిస్తుంది. ఇండియన్ సినిమాలకు, తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉందనే విషయం తెలిసిందే. అమెరికాలో కూడా మన సినిమాలు గ్రాండ్ గా రిలీజవుతుంటాయి. మంచి కలెక్షన్స్ సాధిస్తుంటాయి. మన హీరోలు అక్కడ కూడా కలెక్షన్స్ లో రికార్డులు సృష్టిస్తుంటారు. అయితే తాజాగా హనుమాన్ చిత్రం యూఎస్ఏలో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది.

హనుమాన్ చిత్రం అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేసినట్లు. మన హీరోలంతా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డులు సెట్ చేయాలని అనుకుంటూంటారు. ఈ విషయంలో మహేష్ బాబు అందరికంటే ముందు ఉన్నాడనే చెప్పాలి. ఇప్పుడు రిలీజయిన గుంటూరు కారం సినిమాతో మహేష్ 12 సార్లు ఈ 1 మిలియన్ డాలర్స్ ఫీట్ సాధించి రికార్డు సృష్టించాడు.

ఈ జాబితాలో మన స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ.. పలువురు ఉన్నారు. ఇప్పుడు తాజాగా హనుమాన్ చిత్రంతో తేజా సజ్జా కూడా ఎంటర్ అయ్యాడు. హనుమాన్ సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. కేవలం రోజున్నరలోనే హనుమాన్ సినిమా అమెరికాలో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిందంటే.. మామూలు విషయం కాదు.

 Teja Sajja Prashanth Varma Hanuman Movie Record Collections in USA Full Details Here

దీంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. 2 మిలియన్ డాలర్స్ వరకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇక చూడాలి మున్ముందు ఏ మేర రికార్డులు సృష్టిస్తుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X