HanuMan స్టార్ హీరోలను మడతపెట్టి కొట్టిన హనుమాన్.. ఇదేం మాస్ జాతర!
సంక్రాంతి పండగ కానుకగా తెలుగులో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి. నాగార్జున నా సామిరంగ, వెంకటేషన్ సైంధవ్, మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రాలకు పోటీగా చిన్న చిత్రం హనుమాన్ బరిలోకి వచ్చింది. అయితే వీటన్నింటినీ హనుమాన్.. మడతపెట్టి దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాలను హనుమాన్ దారుణంగా దెబ్బతీసింది. బాక్సాఫీస్ వద్ద హనుమాన్ కలెక్షన్ల వర్షంతో పాటు.. రికార్డులు సృష్టిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సంచలనాలు సృష్టిస్తుంది. తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, విలన్ రాయ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు పోటీగా మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

గుంటూరు కారం మహేశ్ బాబు చిత్రానికి పోటీగా రాగా.. ఆ సినిమాను హనుమాన్ చిత్రం మడతపెట్టేసింది. గుంటూరు కారం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించింది. ఇక ఈ సినిమాకు సంగీతం తమన్ అందించగా.. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. హనుమాన్ సినిమాకు పాజిటివ్ రాగా.. ఇక హనుమాన్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే..నాగార్జున నా సామిరంగ చిత్రానికి మోస్తరు టాక్ వచ్చినా... జనాలు ఎక్కువగా హనుమాన్ సినిమాకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు సైంధవ్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. వెంకటేషన్ కెరియర్ లో 75వ చిత్రంగా తెరకెక్కింది. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణ పరిస్థితిని ఎదుర్కోంటుంది.

ఇక స్టార్ హీరోల చిత్రాలను హనుమాన్ చిత్రం మడతపెట్టి ముందుకు వెళ్తుంది. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాగూర్, కిషన్ రెడ్డిలు హనుమాన్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇక వీరితో పాటుగా పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బుక్ మై షోలో కూడా హనుమాన్ చిత్రం దుమ్ములేపుతంది.
హనుమాన్ చిత్రం 24 గంటల్లో 266కె టికెట్లు అమ్ముడు పోగా.. మహేశ్ త్రివిక్రమ్ గుంటూరు కారానికి మాత్రం 42.98కే టికెట్లు అమ్ముడు పోయాాయి. ఇక నాగార్జున నా సామిరంగ చిత్రానికి 12కె, వెంకటేషన్ సైంధవ్ చిత్రానికి 8కే టెకెట్లు అమ్ముడు పోయాయి. ఇవన్నీంటిలో హనుమాన్ చిత్రం ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయాయి. దీంతో హనుమాన్ చిత్రానికి భారీ ఆదరణ లభిస్తుంది.


Click it and Unblock the Notifications











