HanuMan Collections: యూఎస్‌లోనూ రచ్చరేపిన హనుమాన్.. ప్రీమియర్స్‌కు ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే?
హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి సంచలనం సృష్టించేందుకు రెడీ అయిపోయింది. ఈసారి పండగ బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగలాంటి సినిమాలు ఉన్నా.. తేజ సజ్జ నటించిన ఈ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. ఇక యూఎస్ఏలోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా రచ్చ రేపుతోంది. యూఎస్ ప్రీమియర్ షోల కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సంక్రాంతికి తమ 'హనుమాన్'ను థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందు రోజు రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్ షోలు వేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఇక ఈ సాయంత్రం 6.15 గంటలకు షోలు స్టార్ట్ కానున్నాయి.

పెయిడ్ ప్రీమియర్లకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఓపెనింగ్స్ పరంగా 'హనుమాన్' కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది. నైజాం ఏరియాలో 'హనుమాన్' ప్రీమియర్ షోలు సుమారు 200 స్క్రీన్లలో ప్రదర్శించనుండగా. ఆల్రెడీ 165 షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. మరో 26 షోలు ఓపెన్ చేస్తే... టికెట్ బుకింగ్స్ చేస్తూ సినీ లవర్స్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఆ షోస్ కూడా హౌస్ ఫుల్స్ అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో మాత్రమే కాదు... ఏపీలోనూ 'హనుమాన్'కు అదిరిపోయే ఆదరణ వస్తుంది. ఆంధ్రాలో ఆల్రెడీ 170 షోలు హౌస్ ఫుల్స్ అవ్వగా... మరో 27 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేటస్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. రాయలసీమలోనూ సేమ్ సిట్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ 36 షోలు హౌస్‌ఫుల్స్ కాగా... మరో 14 ఫాస్ట్ ఫిల్లింగ్ కానున్నాయి. బెంగళూరు సిటీలోనూ 'హనుమాన్' పెయిడ్ ప్రీమియర్లు పడుతుండగా అక్కడ 12 షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి... మరో 9 షోలు యాడ్ చేశారు. అవి ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేటస్ లో ఉన్నాయి.

ఒక్క హైదరాబాద్ సిటీలో పెయిడ్ ప్రీమియర్ షోస్ ద్వారా బుధవారం రాత్రికి 'హనుమాన్' కోటి రూపాయల గ్రాస్ క్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. తెలంగాణలో మిగతా జిల్లాలతో పాటు సీడెడ్, ఆంధ్ర, బెంగళూరు కలిపితే... పెయిడ్ ప్రీమియర్ కలెక్షన్స్ మినిమమ్ 3 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం. శుక్రవారం ఉదయానికి ఫుల్ ఫిగర్స్ బయటకు రానున్నాయి. ఓపెనింగ్ డే 'హనుమాన్' కలెక్షన్స్ పది కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని టాక్.
అమెరికాలోనూ 'హనుమాన్' మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. యుఎస్ఏలోనూ ఈ రోజు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అక్కడ ప్రీమియర్ కలెక్షన్స్ 150కె డాలర్స్ క్రాస్ చేసిందని తెలుస్తుంది. సినిమా క్రేజ్ చూస్తుంటే సాయంత్రం లోపు మరిన్ని స్క్రీన్స్ యాడ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











