HanuMan 23 Days Collections: మళ్లీ కుమ్మేసిన హనుమాన్.. అన్ని వందల కోట్లు.. 1.35 కోట్లు వస్తే చరిత్రే!
అప్పుడప్పుడూ తక్కువ బడ్జెట్‌తో వచ్చినా చిత్రాలైనా భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. అదే సమయంలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తుంటాయి. అలాంటి సినిమాల్లో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' ఒకటి. రియల్ సూపర్ హీరో హనుమంతుడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుని భారీ వసూళ్లను సొంతం చేసుకుంటూ వెళ్తోంది. తద్వారా ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తోంది. మరి 'హనుమాన్' మూవీ 23 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!
హనుమాన్‌గా వచ్చేసిన తేజ:తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే 'హనుమాన్'. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు.

హనుమాన్ బిజినెస్ వివరాలు:మాస్ మూవీ 'హనుమాన్'కు నైజాంలో రూ. 7.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, వేరే భాషల్లో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.00 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 29.65 కోట్ల బిజినెస్ చేసుకుంది.
23వ రోజు తెలుగు వసూళ్లు:తేజ సజ్జా హీరోగా నటించిన సినిమానే 'హనుమాన్'. ఈ చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, 3వ వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. కానీ ఈ వీకెండ్‌లో మరోసారి ఈ సినిమా పుంజుకుంది. దీంతో ఈ చిత్రం 23వ రోజు రూ. 74 లక్షలు వసూలు చేసింది.

23 రోజులకూ కలిపి ఎంత?:'హనుమాన్'కు 23 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 38.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.98 కోట్లు, గుంటూరులో రూ. 4.77 కోట్లు, కృష్ణాలో రూ. 4.49 కోట్లు, నెల్లూరులో రూ. 2.42 కోట్లతో కలిపి.. రూ. 85.25 కోట్లు షేర్, రూ. 141 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:23 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 88.25 కోట్లు కొల్లగొట్టిన 'హనుమాన్'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11.90 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 24.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.45 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 148.65 కోట్లు షేర్, రూ. 277.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్.. లాభం ఎంతంటే:తేజ నటించిన 'హనుమాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 30.50 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 148.65 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 118.15 కోట్లు లాభాలతో పెద్ద జాక్‌పాటే తగిలిందని చెప్పాలి.
మరో రికార్డుకు చేరువగానే:ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' మూవీకి ఆరంభం నుంచే అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుతోంది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే రూ. 148.65 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.35 కోట్లు షేర్‌ను ఇది వసూలు చేస్తే రూ. 150 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. అదే జరిగితే ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసేస్తుంది.


Click it and Unblock the Notifications











