HanuMan 26 Days Collections: హనుమాన్ అస్సలు ఊహించని వసూళ్లు.. ఇప్పటికి ఎన్ని కోట్ల లాభమో తెలిస్తే!

హాలీవుడ్‌లో సూపర్ హీరోల నేపథ్యంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి చిత్రాలకు తెలుగులో కూడా చాలా మందే అభిమానులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రియల్ సూపర్ హీరో నేపథ్యంతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని సంక్రాంతికి విడుదలైంది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. మరి 'హనుమాన్' మూవీ 26 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

హనుమాన్‌గా ఎంటరైన తేజ:తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన రియల్ సూపర్ హీరో మూవీనే 'హనుమాన్'. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు.

Teja Sajja Starrer HanuMan Movie 26 Days Worldwide Official Collections

హనుమాన్ బిజినెస్ వివరాలు:'హనుమాన్' సినిమాకు నైజాంలో రూ. 7.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, వేరే భాషల్లో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.00 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 29.65 కోట్ల బిజినెస్‌ జరిగింది.

26వ రోజు తెలుగు వసూళ్లు:ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీగా వస్తూనే ఉన్నాయి. అయితే, మూడో వారం నుంచి ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా డౌన్ అవుతోంది. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 26వ రోజు రూ. 28 లక్షలు వసూలు చేసింది.

Teja Sajja Starrer HanuMan Movie 26 Days Worldwide Official Collections

26 రోజులకూ కలిపి ఎంత?:26 రోజుల్లో 'హనుమాన్'కు ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 38.81 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.44 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.09 కోట్లు, గుంటూరులో రూ. 6.27 కోట్లు, కృష్ణాలో రూ. 4.57 కోట్లు, నెల్లూరులో రూ. 2.46 కోట్లతో కలిపి.. రూ. 88.32 కోట్లు షేర్, రూ. 146.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:తెలుగు రాష్ట్రాల్లో 26 రోజుల్లోనే రూ. 88.32 కోట్లు కొల్లగొట్టిన 'హనుమాన్' సినిమా.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ఏరియాలో రూ. 12.18 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 24.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.80 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 153.10 కోట్లు షేర్‌, రూ. 285.85 కోట్లు గ్రాస్ వసూలు చేసుకుంది.

Teja Sajja Starrer HanuMan Movie 26 Days Worldwide Official Collections

టార్గెట్.. లాభం ఎంతంటే:క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'హనుమాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 30.50 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 153.10 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 122.60 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X