HanuMan 4 Weeks Collections: 30 కోట్లే రావాలి.. 4 వారాల్లో మైండ్ బ్లాక్ వసూళ్లు.. లాభమే అన్ని కోట్లా!

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హీరోల సినిమాలు పెద్దగా రాలేదు. అసలు అలాంటి వాటిని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో చిత్రమే 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు రికార్డు స్థాయిలో లభించాయి. దీంతో ఇది ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. మరి 'హనుమాన్' మూవీ 28 రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

హనుమాన్‌గా తేజ వచ్చేశాడు
తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రమే 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ తీసిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.

Teja Sajja Starrer HanuMan Movie 28 Days Worldwide Official Collections

హనుమాన్ బిజినెస్ వివరాలు
'హనుమాన్' చిత్రానికి నైజాంలో రూ. 7.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.65 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, వేరే భాషల్లో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.00 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రూ. 29.65 కోట్ల బిజినెస్‌ అయింది.

28వ రోజు తెలుగు వసూళ్లు
ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా కాంబినేషన్‌లో రూపొందిన 'హనుమాన్' చిత్రానికి ఆంధ్రా, తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటేత్తాయి. అయితే, మూడో వారం నుంచి ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా తగ్గిపోతున్నాయి. అలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 28వ రోజు రూ. 15 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది.

Teja Sajja Starrer HanuMan Movie 28 Days Worldwide Official Collections

28 రోజులకూ కలిపి ఎంత?
'హనుమాన్'కు 28 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 38.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 11.83 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7.98 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.13 కోట్లు, గుంటూరులో రూ. 6.30 కోట్లు, కృష్ణాలో రూ. 4.59 కోట్లు, నెల్లూరులో రూ. 2.47 కోట్లతో కలిపి.. రూ. 88.68 కోట్లు షేర్, రూ. 146.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
28 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 88.68 కోట్లు కొల్లగొట్టిన 'హనుమాన్' సినిమా.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ఏరియాలో రూ. 12.25 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 24.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.90 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 153.73 కోట్లు షేర్‌, రూ. 287.15 కోట్లు గ్రాస్ వసూలు చేసుకుంది.

టార్గెట్.. లాభం ఎంతంటే
డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన 'హనుమాన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 30.50 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 153.73 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 123.23 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X