HanuMan: కొత్త చరిత్రను రాసిన తేజ సజ్జా.. బన్నీ, చరణ్, మహేశ్ రికార్డులు బ్రేక్

టాలీవుడ్ హిస్టరీలో కొన్ని సినిమాలు మాత్రమే అతి తక్కువ అంచనాలతో వచ్చి సెన్సేషనల్ హిట్లను సొంతం చేసుకున్నాయి. అలాంటి వాటిలో రియల్ సూపర్ హీరో ఆంజనేయస్వామి నేపథ్యంతో తెరకెక్కిన 'హనుమాన్' ఒకటి.

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపకల్పనలో చాలా తక్కువ బడ్జెట్‌తోనే తెరకెక్కిన ఈ సినిమాకు రెస్పాన్స్ భారీ స్థాయిలోనే లభిస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం అక్కడ చరిత్రను సృష్టించింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

Teja Sajja Starrer HanuMan Movie Crossed 4 Million Dollar Mark in USA

హనుమాన్‌గా వచ్చిన తేజ: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే 'హనుమాన్'. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు.

Teja Sajja Starrer HanuMan Movie Crossed 4 Million Dollar Mark in USA

యూఎస్‌లో ఎక్కువగానే: సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'హనుమాన్' సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే తీసుకు వచ్చారు. సంక్రాంతి సినిమాల పోటీ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి పెద్ద స్క్రీన్లు లభించలేదు. కానీ, ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రం అత్యధిక లొకేషన్లలో విడుదలైంది.

Teja Sajja Starrer HanuMan Movie Crossed 4 Million Dollar Mark in USA

అక్కడ అన్నీంటిని దాటి: తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఓవర్సీస్‌లో అయితే ఈ చిత్రం మొదటి రోజు నుంచే క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. ఓవరాల్‌గా సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలనూ ఇది దాటేసింది.

Teja Sajja Starrer HanuMan Movie Crossed 4 Million Dollar Mark in USA

4 మిలియన్ల మార్క్ కొట్టి: రియల్ సూపర్ హీరోతో రూపొందిన 'హనుమాన్' మూవీకి ఓవర్సీస్‌లో సైతం భారీ స్పందన దక్కుతూనే ఉంది. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 386K డాలర్స్ గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు ఇది 520K డాలర్లు వరకూ రాబట్టింది. అప్పటి నుంచి ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇది 4 మిలియన్ మార్కును చేరుకుని చరిత్రను సృష్టించింది.

Teja Sajja Starrer HanuMan Movie Crossed 4 Million Dollar Mark in USA

మొదటి చిత్రంగా రికార్డ్: ఓవర్సీస్‌లో 'హనుమాన్' మూవీ హవా కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఇది 4 మిలియన్ మార్కును చేరుకోవడంతో నార్త్ అమెరియాలో అత్యధిక వసూళ్లు సాధించిన 5వ తెలుగు సినిమాగా ఇది రికార్డు సాధించింది. అందులో మొట్టమొదటి మీడియం రేంజ్ మూవీగా చరిత్ర సృష్టించింది. దీనికంటే ముందు బాహుబలి 2, RRR, సలార్, బాహుబలి 1 మూవీలు ఉన్నాయి.

Teja Sajja Starrer HanuMan Movie Crossed 4 Million Dollar Mark in USA

ఆ హీరోల రికార్డులు బ్రేక్: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'హనుమాన్' మూవీ నార్త్ అమెరికాలో 4 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడంతో ఎన్నో రికార్డులు బద్దలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా 'అల.. వైకుంఠపురంలో' 3.63 మిలియన్ డాలర్లు, 'రంగస్థలం' 3.51 మిలియన్ డాలర్లు, 'భరత్ అనే నేను' 3.41 మిలియన్ డాలర్లు, 'సాహో' 3.23 మిలియన్ డాలర్లు దాటేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X