Tejas Closing Collections కంగన కెరీర్‌లోనే డిజాస్టర్.. 55 కోట్ల టార్గెట్.. ఎంత నష్టమంటే?
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ నటించిన తేజస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నది. తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా దారుణమైన కలెక్షన్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అక్టోబర్ 27 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ దిశగా ప్రయాణిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
కంగన రనౌత్ కెరీర్ విషయానికి వస్తే.. మణికర్ణిక సినిమా తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను నమోదు చేశాయి. జడ్జ్‌మెంటల్ హై క్యా, పంగా, తలైవి, ధాకడ్, టికు వెడ్స్ షేరు, చంద్రముఖి చిత్రాలు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తేజస్ చిత్రం విడుదలైంది.

తేజస్ సినిమా కథ విషయానికి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలెట్ తేజస్ గిల్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన ప్రయాణికులను విడిపించడానికి ఆమె చేసిన వీరోచిత, సాహసోపేతమైన సంఘటనను వెండితెర మీద భావోద్వేంగా మలిచారు. తేజస్ గిల్ పాత్రలో కంగన రనౌత్ నటించింది.
తేజస్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సుమారుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు భారీ క్రేజ్ కనిపించడంతో రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 2500 స్క్రీన్లలో ఇండియాలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 55 కోట్ల రూపాయలని నిర్ధేశించారు.

తేజస్ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.25 కోట్ల రూపాయలు, మూడో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు 50 లక్షలు, 5వ రోజు 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కేవలం 70 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. దాంతో ఐదు రోజుల్లో ఈ సినిమా 6 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.
తేజస్ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 55 కోట్లు రాబట్టాల్సి ఉంది. కానీ ఐదు రోజుల్లో కేవలం 6 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది. అంటే ఈ సినిమా 49 కోట్ల రూపాయల నష్టంతో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నది. తక్కువలో తక్కువ ఈ సినిమా 48 కోట్ల రూపాయల నష్టంతో థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











