భారీగా నష్టపోతున్న ప్రసాద్స్, ఐనాక్స్, సినీమాక్స్
ఇదే విధంగా తెలంగాణా, సమైఖ్యాంద్రా వివాదం కంటెన్యూ అయితే జనవరిలో వచ్చే మేజర్ రెవిన్యూ కోల్పోయినట్లే అంటున్నారు మల్టిఫ్లెక్స్, ఐనాక్స్, సినీమాక్స్ యాజమాన్యాలు. ఐనాక్స్ కు సంబందించిన వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ..హైదరాబాద్ లో ఉన్న మల్టీఫ్లెక్స్ లకు మాగ్జిమమ్ రెవిన్యూ తెలుగు సినిమాలనుంచి వస్తుంది. అవే క్రౌడ్ పుల్లర్స్. ఈ పరిస్ధితుల్లో రాబోయే రెండు వారాల్లో పా, అవతార్, త్రి ఇడియట్స్ కి ఈ ఎఫెక్టుతో కలెక్షన్స్ పెరుగుతాయి.అయితే ఎంతవరకూ నిలబడతాయన్నది ప్రశ్నార్ధకమే.
సంక్రాంతి వరకూ ఈ సిట్యువేషన్ కంటిన్యూ అయితే పండుగ విడుదలలు ఉండవు..దాదాపు 30 పర్శంట్ వరకూ రెవిన్యూ కోల్పోతాం అని విచారంతో చెప్తున్నారు. ఇదే విషయంపై దేవాంగ్ సంపత్..సినీమాక్స్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ..ఎంత తక్కువ చూసుకున్నా ఇరవై లక్షలు వరకూ వచ్చే నెలలో నష్టపోతాం. ప్రస్తుతం అవతార్, త్రి ఇడియట్స్ మీదే ఆశలు ఉన్నాయి. అవీ మూడవ వారంలోకి ప్రవేశిస్తే కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి...అప్పుడు ఇంకా నష్టం అంటున్నారు.
ఇక షోలు కాన్సిల్ చేయటం వల్ల మల్టిప్లెక్స్ లకు చాలా నష్టపోతాయని ప్రసాద్ ఐమాక్స్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఆపరేషన్స్ చెప్తున్నారు. దాదాపు ఈ ఎఫెక్టుతో అన్నీ కలిపి కోటి దాకా నష్టపోయాం అంటున్నారాయన. బంద్ లు ఏజిటేషన్స్ వల్ల ఈ రెండు వారాల్లో మేం వంద షోలు దాకా కాన్సిల్ చేసాం..ఎంత నష్టమో చూడండి అంటూ వాపోతున్నారాయన. ఇప్పటికే కోటి రూపాయలు కోల్పోయిన మేము జనవరిలోనూ ఇదే పరిస్దితి కంటెన్యూ అయ్యి కొత్త చిత్రాలు రిలీద్ కాకపోతే చాలా పెద్ద సమస్యలో పడతాం అంటున్నారు. ఇక ఇప్పటికే ఆర్య 2, సలీం, మగదీర షోలు ఆపుచేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











