twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూలైలో వరుస డిజాస్టర్స్.. రామ్, గోపిచంద్ కంటే దారుణంగా నాగచైతన్య!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది అని అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఎప్పటిలానే వరుసగా డిజాస్టర్ సినిమాలతో షాక్ ఇస్తోంది. ఆడియన్స్ అయితే సరికొత్త కంటెంట్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే చెప్పాలి. ఏమాత్రం రొటీన్ గా అనిపించినా కూడా జనాలు థియేటర్లకు రావడం లేదు. అయితే ఈ క్రమంలో జూలై నెలలో మిడ్ రేంజ్ హీరోలు మాత్రం ఊహించిన విధంగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు. గోపీచంద్, రామ్ పోతినేని సినిమాల కంటే కూడా నాగచైతన్య, రవితేజ సినిమాలు దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. అలాగే రవితేజ సినిమా కూడా డిజాస్టర్ అయినట్లే లెక్క. అసలు ఆ సినిమాలకు పెట్టిన బడ్జెట్ ఎంత? అసలు ఎంత కలెక్షన్స్ వచ్చాయి.. అనే వివరాల్లోకి వెళితే..

    పక్కా కమర్షియల్

    పక్కా కమర్షియల్

    ముందుగా గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని నిర్మాతలు దాదాపు 15 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. కానీ రొటీన్ కమర్షియల్ సినిమా కావడంతో పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 7.95 కోట్లు మాత్రమే వచ్చాయి.

    హ్యాపీ బర్త్ డే

    హ్యాపీ బర్త్ డే

    మత్తు వదలరా సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు రితేష్ రానా తెరపైకి తీసుకువచ్చిన సరికొత్త చిత్రం 'హ్యాపీ బర్త్ డే' జూలై 8వ తేదీన విడుదలయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను 1.6 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. తప్పకుండా సినిమా కూడా పెట్టిన పెట్టుబడిన వెనక్కి తెస్తుందని అనుకున్నారుమ్ కానీ కేవలం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 88 లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది.

     ది వారియర్

    ది వారియర్

    రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా జూలై 22వ తేదీన తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలైంది. తమిళ దర్శకుడు లింగస్వామి తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాలో మొదటిసారి రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించాడు. అయితే ఈ సినిమా కోసం దాదాపు 34.10 కోట్ల వరకు ఖర్చు చేయగా ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది. మొత్తంగా 20.73 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు బడ్జెట్ కాస్త లిమిట్లో పెట్టి ఉంటే టార్గెట్ ఈజిగానే అందుకునేది.

    నాగచైతన్య థాంక్యూ

    నాగచైతన్య థాంక్యూ

    ఇక నాగచైతన్య ఎంతో ఇష్టంగా చేసిన థాంక్యూ సినిమా ఊహించిన ఫలితాన్ని అందుతుంది. మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితం చూసింది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం దాదాపు 24 కోట్లు ఖర్చు చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 3.89 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకుంది.

    రామారావు ఆన్ డ్యూటీ

    రామారావు ఆన్ డ్యూటీ

    ఇక మాస్ మహారాజ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు ముందు కాస్త మంచి హైప్ క్రియేట్ చేసుకుని భారీగానే విడుదలైంది. అయితే సినిమాకు మొదటి షోకే ఊహించిన విధంగా నెగటివ్ టాక్ రావడంతో దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ 17.20 కోట్లు కాగా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 4.35 కోట్ల వసూలు మాత్రమే అందుకుంది. దాదాపు ఇది క్లోజింగ్ కలెక్షన్స్ అని అర్థమవుతుంది.

    English summary
    Telugu biggest disaster movies collections in July month
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X