twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ ‘డేవిడ్’తెలుగు వెర్షన్ కి దెబ్బ...నో రిలీజ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, శివతాండవం... ఇలా విభిన్న పాత్రల ద్వారా నటుడిగా తనేంటో నిరూపించుకున్న జాతీయ నటుడు విక్రమ్. ఆయన తాజాగా 'డేవిడ్'గా ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న విడుదల కానుంది.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేద్దామనుకున్నా... తెలుగులో ఓ వారం లేటుగా విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో తెలుగులో విక్రమ్ చిత్రాలు ఏవీ కలెక్షన్స్ తెచ్చుకోలేకపోవటంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి బిజినెస్ పరంగా ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది. దానికి తోడు అదే రోజు తెలుగులో ఒంగోలు గిత్త వంటి స్ట్రైయిట్ చిత్రాలు విడుదల అవుతూండటంతో థియోటర్స్ సైతం దొరకటం లేదు. సినిమాని 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

    గోవా తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు డేవిడ్‌. అతనికీ ముంబయిలో ఉండే గిటార్‌ వాద్యకారుడు డేవిడ్‌కీ సంబంధం ఏమిటి అన్నది తెర మీదే చూడాలంటున్నారు బిజోయ్‌ నంబియార్‌. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డేవిడ్‌'. విక్రమ్‌, జీవా ప్రధాన పాత్రల్లో నటించారు. లారా దత్తా, టబు, ఇషా శర్వాణీ ముఖ్య పాత్రధారులు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

    ఇందులో విక్రమ్‌, జీవా పాత్రలకు ఉన్న సంబంధం ఏమిటన్న విషయాన్ని ఆసక్తిగా చూపించామని, తెరపై అది ప్రేక్షకులను ఉత్కంఠ కలిగిస్తుందని అంటున్నాడు దర్శకుడు . హిందీ చిత్రం 'సైతాన్' ద్వారా దర్శకునిగా పరిచయమైన బిజోయ్‌కి ఆ సినిమా ఎంతో మంచి పేరుని తెచ్చిపెట్టింది. బిజోయ్‌ మాట్లాడుతూ ''ఇద్దరి పేర్లూ ఒక్కటే... కానీ జీవితాలు, వాళ్ల పయనం మాత్రం వేర్వేరు. ఆద్యంతం వినోదాన్నీ, ఉత్కంఠనీ రేకెత్తించేలా సాగుతుందీ చిత్రం. ఈ కథలోని ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది''అన్నారు. నాజర్‌, సారిక, రోహిణి హట్టంగడి, రెమో ఫెర్నాండెజ్‌, రూబీ చక్రవర్తి, ప్రహ్లాద్‌ కక్కర్‌ తదితరులు నటించారు

    'డేవిడ్‌' చిత్రానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది మ్యూజిక్‌ డెైరెక్టర్లు సంగీతం సమకూర్చనున్నారు. దీన్నో మ్యూజికల్‌ సెన్సేషన్‌గా తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్నాడు ఈ చిత్ర దర్శకుడు బిజయ్‌ నంబియార్‌. ఈ చిత్రానికి సంబంధించి ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్స్‌ను ప్రశాంత్‌ పిళ్లై, అనిరుధ్‌ రవిచందర్‌, రెమొ, మోడర్న్‌ మాఫియా మరికొందరు కంపోజ్‌ చేస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్లు కూడా ఇద్దరు పని చేస్తున్నారు. రత్న వేలుతో పాటు సెజల్‌ కెమెరా వర్క్‌ చూసుకుంటున్నారు.

    English summary
    Vikram’s forthcoming Tamil-Hindi bilingual Telugu dubbed movie David directed by Bejoy which is supposed to release on February 1st has been postponed for a week however the Tamil and Hindi versions will be released as per schedule on February
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X