మల్టిప్లెక్స్ లలో 'బొమ్మాళి' హవా!

"ఏప్రిల్ 30 వరకు వేచి చూస్తాం. సమస్య్ పరిష్కారం కాకపోతే మే 1 నుంచి ఏ మల్టిప్లెక్స్ లోనూ తెలుగు సినిమాలు ఆడవు" అని తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడూ సునీల్ నారంగ్ ఒక సినిమా వెబ్ సైట్ ప్రతినిధికి చెప్పారు. వివాదం పూర్వాపరాలు ఇవి. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు మెరుగైన వాటాను మల్టిప్లెక్స్ ల నుంచి కోరుతున్నారు. ఇప్పుడు వస్తున్న నిష్పత్తి తెలుగు డిస్టిబ్యూటర్లు-మల్టి ప్లెక్స్ లు వరుసగా మొదటి మూడు వారాలకు 50:50, 42':57'. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నది ఈ నిష్పత్తి 60:40, 55:45 and 50:50. హిందీ సినిమాల కంటే ఆంధ్రప్రదేశ్ మల్టిప్లెక్స్ లలో తెలుగు సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఈ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జాతీయ ఎగ్జిబిటర్లకు, తెలుగు డిస్టిబ్యూటర్లకు మధ్య మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి. "అరుంధతి" తెలుగు సినిమా మల్టీప్లెక్స్ లలో పిచ్చి పిచ్చిగా కలెక్షన్లు ఇస్తోంది. ఈ సినిమాకు ఏ హిందీ సినిమా పోటీగా నిలవలేదు.


Click it and Unblock the Notifications











