తమన్నా, హన్సికా నొ యూజ్(ట్రేడ్ టాక్)
తమన్నా, హన్సిక వంటి హీరోయిన్స్ అందచందాలు కన్నా కథ, కథనాలే భాక్సాఫీస్ ని గెలిపించే అంశాలు అని మరోసారి రుజువు అయింది. క్రిందటి వారం రిలీజయిన తమన్నా హీరోయిన్ గా తమిళంలో ప్రేమిస్తే దర్శకుడు రూపొందించిన కళాశాల చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలేకపోతోంది. అలాగే హన్సిక హీరోయిన్ గా చేసిన కన్నడ డబ్బింగ్ చిత్రం పండుగాడు కూడా ఎవరినీ ఆకట్టుకోలేకపోతోంది. అలా ఎప్పటిలాగే ఈ వారం కూడా పూర్తి స్ధాయి నిరాశను మిగిలిస్తూ నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఎలక్షన్స్ అయ్యాక వచ్చిన అధినేత ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంటే, పిల్లల సినిమా సర్కస్..సర్కస్ ఎప్పుడు ఎక్కడ రిలీజైందో తెలియని పరిస్దితి తెచ్చుకుంది.
అంతకు ముందు రిలీజైన భిల్లాకి మా కలెక్షన్స్ ఇంత అంత అని ప్రచారం చేసినా జనాలు నమ్మి ధియోటర్స్ వద్దకు రావటం లేదు. దాంతో అనూష్క కష్టపడి చేసిన బికినీ సీన్ కి వ్యాల్యూ లేకుండా పోయిందని సినీ ప్రియులు బాధ పడుతున్నారు. ఇక నేనే ముఖ్యమంత్రినైతే, ముమైత్ ఖాన్ రెచ్చిపోయి చేసిన పున్నమినాగు చిత్రాలు కూడా బోల్తా కొట్టాయి. ఈ వారం బాలయ్య, ప్రియమణి హీరోగా చేసిన మిత్రుడు, జగపతిబాబు బంగారు బాబు రిలీజయ్యి ఫలితం కోసం వెయిట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











