బాక్సాఫీసు వద్ద బోల్తాలే!

ఇక ఈ వారం విడుదులైన డబ్బింగ్ సినిమాలు 'గది నెంబర్ 305 లో దేముడు' , 'అవతారుడు' . ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'గది నెంబర్ 305 లో దేముడు' సినిమాకి వెళ్ళిన వారికి నిజంగానే దేముడు కనిపిస్తున్నాడు. 'బ్రూస్ ఆల్మైటీ' పాయింట్ తో వచ్చిన ఈ సినిమా కథన లోపంతో కుదేలయింది. అందులో దేముడు రోడ్డుపై పడి కష్టాలు పడటం ఎవరికి నచ్చలేదు. అజిత్ అవతారుడు లో మూస అరవ అవతారాలు చూపి భయపెడుతున్నాడు. అపరిచితుడు తరహా స్టోరీ లైనుతో విష్ణు మూర్తి దశావతారలలో కనపడి హీరో అవినీతిని ఏరేస్తూండటం బోరు కొట్టిస్తోంది.
అలాగే పవన్ కళ్యాణ్, ఇలియానా నటించిన జల్సా కలెక్షన్స్ క్రితం వారం స్టడీగా ఉన్నా ఈ వారం తగ్గు ముఖం పట్టాయి. ఇక రెండు వారాల క్రితం వచ్చిన భలే దొంగలు ...ఛార్మితో ఐటం సాంగ్ చేయించినా ఎవరికి ఆసక్తి కలగటం లేదు. వీటిన్నటికి దూరంగా మంచి కలెక్షన్స్ లతో గమ్యం 50 రోజులు ఈ వారంలో పూర్తి చేసుకుని వంద రోజుల వేడుకకు రీచవుతోంది.


Click it and Unblock the Notifications











