Yatra 2 Day 2 Collections భారీగా పడిపోయిన యాత్ర 2 కలెక్షన్లు.. 2వ రోజు ఎన్ని కోట్లంటే?
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని సంఘటనల ఆధారంగా రూపొందిన యాత్ర 2 చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నప్పటీకి.. బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోతున్నది. యువ దర్శకుడు మహీ వీ రాఘవ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యాత్ర 2 చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే.. మమ్ముట్టి, జీవా లాంటి స్టార్స్ నటించడంతో సినిమా నిర్మాణ వ్యయం భారీగానే అయింది. ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 50 కోట్ల రూపాయల వరకు అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ వాల్యూను 25 కోట్ల షేర్, 50 గ్రాస్‌గా నిర్ణయించారు.

బాక్సాఫీస్‌కు సంబంధించి భారీ లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 చిత్రం సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో మమ్ముట్టి, జీవా నటనకు ప్రేక్షకులు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ మూవీకి క్రిటిక్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. తొలి షో నుంచే సానుకూలత ఏర్పడింది. కానీ బాక్సాఫీస్ మాత్రం వాటి ప్రభావం కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

యాత్ర 2 చిత్రం తొలి రోజు భారీగానే వసూళ్లు సాధించింది. ఈ సినిమా తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లో గౌరవప్రదమైన కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా 1000 షోలకుపైగా ప్రదర్శించడం ద్వారా సుమారుగా 2 కోట్ల రూపాయలు నికర వసూళ్లను, 3.5 గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక రెండో రోజు యాత్ర 2 ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఓ మాదిరిగ నమోదు అయింది. మార్నింగ్ షోకు 28 శాతం, మ్యాట్నీకి 30 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 42 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే పాజిటివ్ టాక్ ఉన్న సినిమాకు రెండో రోజు యావరేజ్‌గా ఆక్యుపెన్సీ రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక యాత్ర 2 రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా సుమారుగా 1 కోటి రూపాయలు నికరంగా, ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దాంతో గత రెండు రోజుల్లో ఈ సినిమా 5.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. బాక్సాఫీస్ వద్ద ఏదో మ్యాజిక్ జరగాల్సిందే అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











