Bheemla Nayak Collections: తొలి రోజు అన్ని కోట్లు వచ్చినా నిరాశే.. ఆ రికార్డులు దాటలేకపోయిన పవన్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు. ఇక, మధ్యలో కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నా.. 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకున్నాడు. ఇది ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఇక, ఇప్పుడు 'భీమ్లా నాయక్' అనే సినిమాతో పవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారమే విడుదలైన ఈ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్లను సాధించింది. కానీ, కొన్ని రికార్డులను మాత్రం దాటలేక నిరాశనే ఎదుర్కొంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

 రానాతో కలిసి వచ్చిన పవన్ కల్యాణ్

రానాతో కలిసి వచ్చిన పవన్ కల్యాణ్

‘వకీల్ సాబ్' తర్వాత పవన్ కల్యాణ్ నటించిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. రానా మరో ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాను సాగర్ కే చంద్ర రూపొందించాడు. సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

భీమ్లా నాయక్ ప్రీ బిజినెస్ వివరాలు

భీమ్లా నాయక్ ప్రీ బిజినెస్ వివరాలు

పవన్ - రానా కలయికలో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 88.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే, ఈ సినిమాకు సంబంధించిన రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇవన్నీ కలుపుకుంటే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

 ఫస్ట్ డేన ఎక్కడ.. ఎంత రాబట్టింది?

ఫస్ట్ డేన ఎక్కడ.. ఎంత రాబట్టింది?

ఏపీ, తెలంగాణలో ‘భీమ్లా నాయక్'కు తొలి రోజు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 11.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.88 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.95 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.02 కోట్లు, గుంటూరులో రూ. 2.51 కోట్లు, కృష్ణాలో రూ. 89 లక్షలు, నెల్లూరులో రూ. 1.04 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26.42 కోట్లు షేర్, రూ. 38 కోట్లు గ్రాస్ దక్కింది.

అన్ని కోట్లు వచ్చినా ఫ్యాన్స్ నిరాశే

అన్ని కోట్లు వచ్చినా ఫ్యాన్స్ నిరాశే

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ‘భీమ్లా నాయక్' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 26.42 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, అన్ని ప్రాంతాలనూ కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.37 కోట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కినట్లైంది. కానీ, టాలీవుడ్‌లో ఉన్న కొన్ని రికార్డులను మాత్రం ఇది దాటలేకపోయింది.

చివరి ఐదు సినిమాల్లో రెండో స్థానం

చివరి ఐదు సినిమాల్లో రెండో స్థానం

గతంతో పోలిస్తే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మార్కెట్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో ‘భీమ్లా నాయక్'కు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు. కానీ, ఈ సినిమా వకీల్ సాబ్ (రూ. 32.24)ను దాటలేకపోయింది. రూ. 26.42 కోట్లతో భీమ్లా నాయక్ రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత అజ్ఞాతవాసి, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ ఉన్నాయి.

ఓవరాల్‌గా చూస్తే ఏడో స్థానంలోనే

ఓవరాల్‌గా చూస్తే ఏడో స్థానంలోనే


ఏపీ, తెలంగాణలో కలిపి మొదటి రోజు ఎక్కువ షేర్ సాధించిన చిత్రాల జాబితాలో ‘భీమ్లా నాయక్' ఏడో స్థానానికే పరిమితం అయింది. ఇందులో బాహుబలి (రూ. 43 కోట్లు), సైరా (రూ. 38.75 కోట్లు), సాహో (రూ. 36.52 కోట్లు), సరిలేరు నీకెవ్వరు (రూ. 32.77 కోట్లు), వకీల్ సాబ్ (రూ. 32.24 కోట్లు), అరవింద సమేత (రూ. 26.64 కోట్లు) దీని కంటే ముందు వరుసలో ఉన్నాయి.

Recommended Video

Bheemla Nayak Team Celebrations కళ్యాణ్ ఫాన్స్ కి గురూజీ బాకీ తీర్చేసాడుగా | Filmibeat Telugu
అదే జరిగితే అన్ని రికార్డ్స్ బద్దలే

అదే జరిగితే అన్ని రికార్డ్స్ బద్దలే

పవన్ కల్యాణ్ - రానా నటించిన ‘భీమ్లా నాయక్' మూవీకి ఓపెనింగ్స్ కొంత తగ్గడానికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు తక్కువగా ఉండడమే కారణం అని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో టికెట్ రేట్లు రూ. 20 కూడా ఉన్నాయి. ఇది ఈ సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావాన్ని చూపించింది. లేకుంటే మొదటి రోజు ఇంకొంత మొత్తం వసూలు అయ్యేది. దీంతో రికార్డులూ బద్దలయ్యేవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X