Radhe Shyam: అజ్ఞాతవాసి, స్పైడర్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న ప్రభాస్.. ఈ లెక్క ఎవరికి సాధ్యం కాదేమో?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మన అగ్రహీరోలు బాలీవుడ్ హీరోలకు దీటుగా బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటూ ఉండటం మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఇక ప్రభాస్ అయితే బాహుబలి సినిమా తో ఒక్కసారిగా తన స్థాయిని అమాంతంగా పెంచుకోవడంతో అందరూ ఎంతగానో సంతోషించారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది ఇటీవల వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ కెరీర్ లోనే అతి దారుణమైన నష్టాలను ఎదుర్కోబోతున్న ట్లుగా అర్థమవుతోంది. ఒక విధంగా రాధే శ్యామ్ సినిమా అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాల కంటే అత్యంత ఎక్కువ నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అలా వేల కోట్లకు వెళ్లిన ప్రభాస్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల మార్కెట్ అయితే ప్రతి ఏడాది చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పాలి. బాహుబలి సినిమా కంటే ముందు మిర్చి సినిమాతో కనీసం వంద కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా చూడని ప్రభాస్ బాహుబలి సినిమాలో అయితే ఒక్కసారిగా గా వందల కోట్ల నుంచి వేల కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా మంచి గుర్తింపును అందుకున్నాడు.

హిందీలో కూడా..
అయితే ప్రభాస్ బాహుబలి 2 సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. యువి క్రియేషన్స్ నిర్మించిన సాహో సినిమా రాధే శ్యామ్ సినిమా రెండు కూడా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ అందించినప్పటికీ ఈ సినిమాపై బిజినెస్ చేసినటువంటి బయ్యర్లు చాలావరకు నష్టాలను చూసే పరిస్థితులు ఎదురయ్యాయి. సాహో సినిమా అయితే కనీసం హిందీ లో అయినా సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన రాధే శ్యామ్ ఏ భాషలోనూ పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

మూడు రోజుల తరువాత
అయితే రాధే శ్యామ్ సినిమా గత సినిమాల కంటే కూడా కొన్ని బ్యాడ్ రికార్డులను కూడా బ్రేక్ చేసే విధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మొదటి ఐదు రోజుల్లో ఈ సినిమా 77కోట్ల షేర్ వసూళ్లను సాదించింది. ఆదివారం రోజు 10కోట్ల షేర్ సాధించిన ఈ మూవీ సోమవారం రోజు ఒక్కసారిగా రెండు కోట్ల కలెక్షన్స్ కు పడిపోయింది. ఇక 5వ రోజు అయితే మరింత దారుణంగా ఒక కోటి వసూళ్లను మాత్రమే సాధించింది.

ఆ టార్గెట్ అందుకోవడం కష్టమే..
ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి మొత్తంగా రాధే శ్యామ్ సినిమా 204కోట్ల షేర్ ను అందుకోవాలి. ఇక సినిమా ఇప్పటికే 77కోట్ల షేర్ సాధించింది కాబట్టి మరో 126కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఐదవ రోజు కోటి వసూళ్లను అందుకున్న ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. ఇక మార్చి 25కి వచ్చేసరికి RRR రానుంది కాబట్టి అప్పటికి ఈ సినిమా థియేటర్స్ లో ఉండడం కూడా కష్టమే అనిపిస్తోంది.
Recommended Video


అజ్ఞాతవాసి కంటే ఎక్కువ నష్టాలు
ఇక ఇప్పటివరకు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అందుకున్న తెలుగు హీరోల సినిమాలలో అజ్ఞాతవాసి 66 కోట్ల నష్టాన్ని మిగల్చగా స్పైడర్ సినిమా 60కోట్ల వరకు నష్టాలను మిగిల్చి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లలో టాప్ లో నిలిచాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ ను చూస్తుంటే అంతకంటే ఎక్కువ స్థాయిలో దాదాపు 100కోట్లకు పైగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











