»   » సమ్మర్ 2016: పవన్,మహేష్ , బన్ని, ఇంకా... 400 కోట్లు బెట్

సమ్మర్ 2016: పవన్,మహేష్ , బన్ని, ఇంకా... 400 కోట్లు బెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ సమ్మర్ అప్పుడే పూర్తిగా హాట్ గా మారి సెగలు కక్కుతోంది. అయితే టాలీవుడ్ మాత్రం ఇంకా వేడిక్కలేదనే చెప్పాలి. ప్రస్తుతం చిన్న సినిమాల రిలీజ్ లతో టాలివుడ్ మాత్రం చల్లగానే ఉంది.

కాకపోతే మరి కొద్ది రోజుల్లో అంటే ఏప్రియల్ నుంచి టాలీవుడ్ భాక్సాఫీస్ రిలీజ్ లతో పూర్తి బిజీ కానుంది. దాదాపుగా రెండు వారాలకు ఓ పెద్ద సినిమా ధియోటర్ తలుపు తట్టనుంది.

ఈ సమ్మర్ కు దాదాపు నాలుగు వందల కోట్ల మేరకు బిజినెస్ జరగనుందని తెలుస్తోంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగార్జున వంటి పెద్ద స్టార్స్ అంతా ఈ వేసవికి మన తీర్పు కోరుతూ మన ముందుకు వస్తున్నారు.

ఈ సమ్మర్ రేసులో స్టార్ హీరోలు, సీనియర్ హీరోలే కాదు ఇప్పుడిప్పుడే కెరీర్ కు ప్రారంబిస్తున్న ఓ ఇద్దరు యంగ్ హీరోలు కూడా పాల్గొంటున్నారు. అంతేనా వీటి మధ్యలో మరికొన్ని చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి.
మొత్తంమీద అన్ని చిత్రాలను కలుపుకుంటే ఈ సమ్మర్ కి టోటల్ గా ఓ 400 కోట్లు బిజినెస్ జరగుతుందని అంచనా. ఇప్పటికే కొన్ని చిత్రాలపై జనం హోప్స్ బాగా పెట్టుకున్నారు. మరి వాళ్లంతా అందరి అంచనాల్ని ఏ రేంజ్ లో అందుకుంటారో, ఆ రేంజ్ వసూళ్ళు సాధిస్తారో చూడాలి.

స్లైడ్ షోలో ఏ చిత్రాలు రిలీజ్ అవుతాయో చూద్దాం...

సరైనోడు

సరైనోడు

అల్లు అర్డున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను డైరక్టర్. మాస్ ఇమేజ్ ను పెంచుకోవాడనికి అల్లు అర్జున్ చేస్తున్న ప్రయత్నం ఇది. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత రిలీజ్ చేస్తున్న చిత్రం ఇదే.

అ..ఆ

అ..ఆ

త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ లుక్ ని మొన్నీ మధ్యనే విడుదల చేసారు. ఈ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

మహేష్ ఈ మధ్య ఫ్యామిలి ఆడియన్స్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు. దానికి తోడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టీంతోనే ఈ సినిమా కూడా తీస్తున్నాడు. శ్రీమంతుడు వంటి బ్లాక్ బ్లస్టర్ తర్వత రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

కబాలి

కబాలి

రజినికాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి. లింగా సినిమా ప్లాప్ అవ్వడంతో అభిమానులు ఈ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం భారీగానే విడుదల అవుతోంది.

సర్థార్ గబ్బర్ సింగ్

సర్థార్ గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్ హిట్ అవ్వడంతోనే, దానికి సెమీ సీక్వెల్ గా తీస్తున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి. ప్రతి రోజు ఇంచుమించు ఓ కొత్త న్యూస్ తో అభిమానులకు దగ్గరగా వుంటున్నారు పవన్.

సుప్రీమ్

సుప్రీమ్

అనీల్ రావిపాటి, సాయిధరమ్ తేజ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సుప్రీమ్. ఈ చిత్రం కూడా ఈ సమ్మర్ కే వస్తోంది. ఈ చిత్రం మంచి బిజినెస్ నే చేసింది.

 థేరి

థేరి

విజయ్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. తన లాస్ట్ సినిమా పులి డిజాస్టర్ అవ్వడంతో తన హోప్స్ అన్ని దీనిపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ డబ్ చేస్తున్నారు.

ఊపిరి

ఊపిరి

మొన్నీ మధ్యే సోగ్గాడే చిన్ని నాయినా అంటూ హిట్ కొట్టిన నాగార్జున, కార్తి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది.

బాబు బంగారం

బాబు బంగారం

వెంకటేష్,మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రం పూర్తి కామెడీతో రూపొందుతోందని టాక్. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

24

24

సూర్య హీరోగా నటిస్తున్న సినిమా 24. పూర్తిగా సైన్స్ ఫిక్షన్ ధ్రిల్లర్ గా వుండనున్న ఈ సినిమాకూడా సమ్మర్ స్పెషల్ గానే తెలుగులోనూ విడుదలవుతోంది. వెరైటీ పాత్రలతో ఎప్పూడు కొత్తదనం అందించే సూర్య, ఈ సారి ఎంచేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు

ప్రేమమ్

ప్రేమమ్


నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం మళయాళంలో విజయం సాధించిన ప్రేమమ్ రీమేక్ కావటం విశేషం. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

 ఫ్యాన్

ఫ్యాన్

షారుక్ ఖాన్ హిరో గా రూపోందుతున్న ఈ సినిమా ఓ హీరోకి, ఓ అభిమానికి జరిగే యుద్దం అని తెలుస్తోంది. దిల్ వాలే సినిమాతో వచ్చిన కిక్ తో ముందుకు దూసుకుపోతున్నాడు షారుక్. ఆంధ్రా, తెలంగాణాలలో పెద్ద సిటీలన్నిటిలోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

English summary
Here is the list of Telugu Movies Summer 2016 for you. Tollywood big stars like Pawan Kalyan, Mahesh Babu, Allu Arjun, Nagarjuna and few others arriving for this summer 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu