»   » షాక్:‘విక్రమ్ సింహా‌’తెలుగు రైట్స్ కు అంతా?

షాక్:‘విక్రమ్ సింహా‌’తెలుగు రైట్స్ కు అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా 'కోచ్చడయాన్‌'. దీపిక పదుకొనె హీరోయిన్ . ఆది పినిశెట్టి ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. రజనీకాంత్‌ తనయురాలు సౌందర్య ఆర్‌.అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో విక్రమ్ సింహా టైటిల్ తో రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ని లక్ష్మి గణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. అయితే ఈ తెలుగు వెర్షన్ కు గాను ఎంత ఖర్చు పెట్టారు...ఏ రేంజిలో బిజినెస్ అవుతుందనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.

అందుతున్న సమాచారం ప్రకారం ఐదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఈ చిత్రం రైట్స్ ని రెండేళ్ల క్రితం తీసుకోవటానికి సుబ్రమణ్యం ఎగ్రిమెంట్ రాసారు. మొత్తం తెలుగు వెర్షన్ కు గానూ 28 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ డబ్బింగ్ చిత్రానికి ఇంత మొత్తం పెట్టలేదు. అయితే రజనీ గత చిత్రం రోబో దాదాపు 28 కోట్లు వసూలు చేయటంతో ఈ మొత్తం వెచ్చించినట్లు చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే అది పెద్ద సంచలన విజయం సాధించాలని అంటున్నారు.

Telugu rights of Kochadaiyaan for 28 crores

తమిళ్‌, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శోభన, శరత్‌కుమార్‌, జాకీ ష్రాప్‌, నాజర్‌ ..ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ విభిన్న అవతారంలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులు సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్‌ క్రియేట్‌ చేశాయి.

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు.


'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

English summary
producer Subramanyam of Lakshmi Ganapathi films has bought the Telugu rights of "Kochadaiyaan" for 28 crores, highest price paid for a dubbed Telugu film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu