twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి తర్వాత అత్యధిక లాభాలు పండించిన సినిమాలు.. టాప్ లిస్టులో ఏ మూవీస్ అంటే?

    |

    రోజురోజుకు టాలీవుడ్ మార్కెట్ స్థాయి అమాంతంగా పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మన హీరోల నుంచే ఎక్కువగా సక్సెస్ రెట్ వస్తోందని చెప్పాలి. ఇక బాహుబలి నుంచి ఆ లెక్కలు మరింత ఎక్కువవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులలోకి వెళితే ఎవరు ఊహించని సినిమాలు అత్యధిక ప్రాఫిట్స్ అంధించిన జాబితాలలో దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు బాహుబలిని మినహాయిస్తే థియేట్రికల్ బిజినెస్ పరంగా అత్యధికంగా ప్రాఫిట్స్ అందించిన సినిమాల లిస్టు ఈ విధంగా ఉంది. ఒకసారి టాప్ 8 సినిమాల లెక్కలను పరిశీలిస్తే...

    ఉప్పెన 8వ స్థానంలో..

    ఉప్పెన 8వ స్థానంలో..

    8వ స్థానంలో ఉప్పెన సినిమా అత్యధికంగా లాభాలను అందించిన సినిమాల్లో నిలిచింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా బాక్సాఫీస్ వద్ద 31.02 కోట్లకు పైగా లాభాలను అందించింది. అంతేకాకుండా బెస్ట్ ఎంట్రీ ఇచ్చిన హీరోల లిస్టులో వైష్ణవ్ తేజ్ కూడా టాప్ లిస్టులో నిలిచాడు.

     సోగ్గాడే చిన్నినాయన

    సోగ్గాడే చిన్నినాయన

    అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన 2016 లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో లాభాలను కూడా అందించింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగార్జున తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు ఇక ఈ సినిమా 18 కోట్ల వరకు బిజినెస్ చేయగా 31.2 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద లాభాలను అందించింది. ఈ లిస్టులో సోగ్గాడే చిన్నినాయన ఏడవ స్థానంలో నిలిచింది.

    పుష్ప రికార్డు

    పుష్ప రికార్డు

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక లాభాలను అందించిన ఆరో సినిమాగా పుష్ప సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా తెలుగులో 144.19 కోట్ల వరకు బిజినెస్ చేయగా అత్యధికంగా 33 కోట్ల వరకు ప్రాఫిట్ సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు కొంత ఆంధ్రప్రదేశ్లోని టికెట్ల రేట్లు కూడా ప్రభావం చూపించాయి. కోవిడ్ పరిస్థితులు లేకపోయి ఉంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది.

     సరిలేరు నీకెవ్వరు

    సరిలేరు నీకెవ్వరు

    ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్టు లో 5వ స్థానంలో నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు మొదటి సారి చేసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంక్రాంతి బరిలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సరికొత్త యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక 99.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తం 39.36 కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించింది.

    రామ్ చరణ్ రంగస్థలం

    రామ్ చరణ్ రంగస్థలం

    సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మొత్తంగా రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకని రామ్ చరణ్ కెరీర్లోనే ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తెలుగులో 80 కోట్లకు పైగా బిజినెస్ చేయగా బాక్సాఫీస్ వద్ద 47.5 52 కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించింది.

     వరుణ్ వెంకీ.. F2

    వరుణ్ వెంకీ.. F2

    ఇక అత్యధిక ప్రొఫైల్స్ అందించిన సినిమాల్లో F3 మూడవ స్థానంలో నిలిచింది. వెంకటేశ్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. ఇక సంక్రాంతి ఫెస్టివల్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంది. 34.5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన F2 50కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించింది.

    విజయ్ గీతగోవిందం

    విజయ్ గీతగోవిందం

    ఇక విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన గీతగోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో గీతగోవిందం టాప్ లిస్టులో నిలిచింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ GA2 లో నిర్మించారు. ఇక 15కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలవ్వగా సినిమా బాక్సాఫీస్ వద్ద 55.43కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించింది.

    Recommended Video

    YouTube రికార్డులు తిరగరాసిన Vakeel Saab ,బాహుబలి 2 రికార్డ్ బ్రేక్
     నెంబర్ వన్ లో.. అల.. వైకుంఠపురములో

    నెంబర్ వన్ లో.. అల.. వైకుంఠపురములో

    ఇక అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమా థియేట్రికల్ గా అత్యధిక లాభాలు అందించిన తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హారిక హాసిని నిర్మించగా థమన్ సంగీతం అంధించారు. ఇక సంక్రాంతి భరిలో ఈ సినిమా 84.34కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడిదలవ్వగా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 75.88కోట్ల వరకు లాభాలను అందించింది.

    English summary
    Telugu top most profitable movies non baahubali records
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X