Telusu Kada Closing Collections: తెలుసు కదా క్లోజింగ్ కలెక్షన్లు.. సిద్దూ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం తెలుసు కదా. రొమాంటిక్, మ్యూజికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి డైరెక్టర్‌గా మారారు.

రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి రూపొందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలీ ఎడిటింగ్, ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. థమన్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ 2025 సంవత్సరం రోజున రిలీజైంది. అయితే ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఏర్పడిన అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బిజినెస్ ఎంత? ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్లు వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే..

Telusu Kada Movie Closing Collections

తెలుసు కదా మూవీని సుమారుగా 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ 8 కోట్లు, మ్యూజిక్ రైట్స్ 1.5 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా 25.5 కోట్ల రూపాయలు నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సిద్దూ జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా డిజాస్టర్ కారణంగా తెలుసు కదా సినిమా థియేట్రికల్ రైట్స్‌కు అంతగా క్రేజ్ కనిపించలేదనేది ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ సినిమా బిజినెస్ సుమారుగా 25 కోట్ల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 25 కోట్ల రూపాయల షేర్, 50 గ్రాస్ వసూళ్లను సాధించాల్సిన పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ చిత్రం 2.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 3 కోట్ల రూపాయలు, 3వ రోజు 2.5 కోట్ల రూపాయలు, 4వ రోజు 1.25 కోట్ల రూపాయలు, 5వ రోజు 1 కోటి రూపాయలు, 6వ రోజు 70 లక్షల రూపాయలు, 7వ రోజు 40 లక్షలు, 8వ రోజు 30 లక్షలు, 9వ రోజు 27 లక్షలు, 10వ రోజు 23 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 11.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

ఇదిలా ఉంటే, నార్త్ అమెరికాలో ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. యూఎస్, కెనడాలో దారుణమైన కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా గత 10 రోజుల్లో ఓవర్సీస్‌లో మొత్తంగా 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, అలాగే 7.5 కోట్ల షేర్ కలెక్షన్లు నమోదు చేసింది.

సిద్దూ జొన్నలగడ్డ కెరీర్‌లో రెండో దారుణమైన డిజాస్టర్. గతంలో ఆయన నటించిన జాక్ చిత్రం థియేట్రికల్ రన్‌లో 10 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం తెలుసు కదా చిత్రం 7 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీ నష్టాల్లో అంటే.. థియేట్రికల్‌గా సుమారుగా 18 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూసింది. ప్రొడక్షన్ పరంగా బడ్జెట్‌తో పోల్చితే 18 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందనే పానీపూరి, ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X