Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెనాలి రామకృష్ణుడి కామెడీ, విశాల్ యాక్షన్.. మొత్తంగా చూస్తే మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్
ఈ శుక్రవారం (నవంబర్ 15వ తేదీ) ప్రేక్షకుల ముందుకొచ్చాయి తెనాలి రామకృష్ణ, యాక్షన్ సినిమాలు. సందీప్ కిషన్- హన్సిక హీరో హీరోయిన్లుగా వచ్చిన 'తెనాలి రామకృష్ణ', విశాల్- తమన్నా జంటగా వచ్చిన 'యాక్షన్' సినిమాలు మొదటి రోజు ఎలా పర్ఫార్మ్ చేశాయి? ఎంతమేర కలెక్షన్స్ వసూలు చేశాయి? ఆ వివరాలు చూద్దామా..
మిశ్రమ స్పందన.. కలెక్షన్స్‌పై ప్రభావంf
కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'తెనాలి రామకృష్ణ' సినిమా తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అదే బాటలో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 'యాక్షన్' కూడా పయనించింది. ఈ మిశ్రమ స్పందన ఎఫెక్ట్ రెండు సినిమాలపై పడిందనే తాజా రిపోర్ట్స్ చేసుతుంటే స్పష్టంగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు నీరసం
'తెనాలి రామకృష్ణ' సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అనుకున్నట్లే 50 లక్షలకు పైగా షేర్ని అందుకోగా వరల్డ్ వైడ్‌గా చాలా నీరసపడింది. మొత్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కేవలం 60 లక్షల లోపు షేర్ తోనే సరి పెట్టుకుంది సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ' మూవీ.
ఏరియాల వారిగా తెనాలి రామకృష్ణుడి కలెక్షన్స్
తొలిరోజు ఏరియాల వారిగా తెనాలి రామకృష్ణుడి కలెక్షన్స్ చూస్తే.. నైజాం 21 లక్షలు, సీడెడ్ 6 లక్షలు, ఉత్తరాంధ్ర 7 లక్షలు, ఈస్ట్ గోదావరి 5.2 లక్షలు, వెస్ట్ గోదావరి 3.8 లక్షలు, గుంటూరు 4.2 లక్షలు, కృష్ణ 5.1 లక్షలు, నెల్లూరు 3 లక్షలు,రెండు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 55 లక్షలు రాబట్టింది ఈ సినిమా. కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవెర్సిస్ కలిపి మరో 3 లక్షలు మొత్తంగా 59 లక్షలు రాబట్టింది 'తెనాలి రామకృష్ణ'.
తెనాలి రామకృష్ణుడి బాటలోనే యాక్షన్
తెలుగు ప్రేక్షకుల ముందుకు యాక్షన్ అంటూ రా ఏజెంట్ నేపథ్యంతో వచ్చిన 'యాక్షన్' సినిమా ఎబో యావరేజ్ రేంజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఈ సినిమా కూడా తెనాలి రామకృష్ణుడి బాటలోనే నడిచి నీరసపడింది.
ఏరియాల వారిగా యాక్షన్ ఎలా ఉందో చూడండి..
రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 66 లక్షల షేర్ రాబట్టింది యాక్షన్ సినిమా. నైజాం 28 లక్షలు, సీడెడ్ 10 లక్షలు, ఉత్తరాంధ్ర 7.5 లక్షలు, ఈస్ట్ గోదావరి 5.5 లక్షలు, వెస్ట్ గోదావరి 3.2 లక్షలు, గుంటూరు 4.7 లక్షలు, కృష్ణ 4.9 లక్షలు, నెల్లూరు 2.2 లక్షలు కాలేచ్ట్ చేసింది విశాల్ యాక్షన్.
రెండు సినిమాల బ్రేక్ ఈవెన్స్
ఇక ఈ రెండు సినిమా బ్రెల్ ఈవెన్స్ చూస్తే.. 7.2 కోట్లకు పైగా షేర్ని అందుకోవాల్సి ఉంటుంది యాక్షన్. అలాగే మినిమం 5 కోట్ల రేంజ్లో షేర్ అందుకోవాల్సి ఉంటుంది తెనాలి రామకృష్ణ. చూడాలి మరి ఈ రెండు సినిమాలు ఇంకెంత మేర రాబడతాయో!.