Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తెనాలి రామకృష్ణ, యాక్షన్ కలెక్షన్ వివరాలు.. తొలివారంలో ఎంత రాబట్టాయంటే
తెనాలి రామకృష్ణ, యాక్షన్ ఈ రెండు సినిమాలు నవంబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సందీప్ కిషన్- హన్సిక హీరో హీరోయిన్లుగా వచ్చిన 'తెనాలి రామకృష్ణ', విశాల్- తమన్నా జంటగా వచ్చిన 'యాక్షన్' సినిమాలు మొదటి వారంలో ఎలా పర్ఫార్మ్ చేశాయి? ఎంతమేర కలెక్షన్స్ వసూలు చేశాయి? ఆ వివరాలు చూద్దామా..
కలెక్షన్స్‌పై ప్రభావం చూపిన మౌత్ టాక్
కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'తెనాలి రామకృష్ణ' సినిమా తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అదే బాటలో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 'యాక్షన్' కూడా పయనించింది. ఈ మిశ్రమ స్పందన ఎఫెక్ట్ రెండు సినిమాలపై పడిందనే తాజా రిపోర్ట్స్ చేసుతుంటే స్పష్టంగా తెలుస్తోంది.
7వ రోజు తెనాలి రామకృష్ణుడి పరిస్థితి
ముందు నుంచే వీక్ గా నడుస్తున్న తెనాలి రామకృష్ణ 7వ రోజు నాటికి మరింత డీలా పడింది. 7వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల కలెక్షన్స్ చూస్తే 2.19 కోట్లుగా ఉంది. అదే ప్రపంచ వ్యాప్తంగా అయితే 2.39 కోట్ల రూపాయలు వచ్చాయి.
తెనాలి రామకృష్ణుడు బ్రేక్ ఈవెన్ దాటాలంటే..
ప్రపంచ వ్యాప్తంగా 3.82 కోట్లా రూపాయల గ్రాస్ రాబట్టిన తెనాలి రామకృష్ణుడు బ్రేక్ ఈవెన్ దాటాలంటే మరో 2.61 కోట్లు రాబట్టాల్సి ఉంది. తాజా పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటడం కూడా కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు.
విశాల్- తమన్నా యాక్షన్
ఇక విశాల్- తమన్నా జంటగా వచ్చిన యాక్షన్ సినిమా 7వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. 7 రోజుల్లో మొత్తంగా చూస్తే 2.56 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది. 4.24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
యాక్షన్ బ్రేక్ ఈవెన్.. పరిస్థితి ఎలా ఉందంటే
యాక్షన్ మూవీ విడుదలకు ముందు 6.70 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ దాటాలంటే దాదాపు 7.20 కోట్లను మించి రాబట్టాలి. అంటే ఇంకా 4.64 కోట్ల రూపాయలు రాబట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ లెక్కన చూస్తే యాక్షన్ కూడా డీలా పడ్డట్టే లెక్క అంటున్నారు విశ్లేషకులు.