టెన్త్‌క్లాస్‌కు సగటు మార్కులు
చందు దర్శకత్వం వహించిన టెన్త్ క్లాస్ సినిమా యావరేజిగా ఆడుతోంది. యూత్‌కి పట్టే అనేక అంశాలు ఇందులో ఉండడంతో ఈ సినిమా సైలెంట్‌గా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని రోజుల్లోనే నాలుగు భారీ తెలుగు సినిమాలు విడుదల కానుండడంతో చిన్న సినిమాల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్ధితి. ఇక వీరు కె దర్శకత్వంలో వచ్చిన త్రిల్ సినిమాలో దిల్ లోపించింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్‌తో మొదలైంది. సినిమాను రక్షించే అంశాలు పెద్దగా లేవు. అర్ధం పర్ధం లేని కథ సినిమాను దెబ్బతీసింది. నాగార్జున- రాఘవేంద్రరావుల శ్రీ రామదాసు సినిమా ఇంకా యావరేజి స్ధాయి నుంచి పైకి ఎదగలేదు. ఒకసారి చూసే ప్రేక్షకులే తప్ప రిపీట్ ఆడియెన్స్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్. చాలాకాలం తర్వాత ఒక భక్తిరస చిత్రం విడుదల కావడంతో ఈ సినిమాను చూడాలన్న ఆసక్తి సహజంగా మంచి టేస్టు ఉన్న ప్రేక్షకులకు ఉంటుంది. కానీ సినిమా చూసిన తర్వాత గొప్ప ఫీల్ కలగకపోవడంతో సినిమాకు సంబంధించిన ప్రచారం జనం నోళ్ళ ద్వారా జరగడం లేదు.


Click it and Unblock the Notifications