Tere Ishk Mein Day 1 Collections: రికార్డ్ ఓపెనింగ్స్ కొట్టిన ధనుష్... తేరే ఇష్క్ మే మూవీకి ఎన్ని కోట్లంటే?
ధనుష్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం తేరే ఇష్క్ మే. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరిస్ ఫిలింస్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృషాన్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మించగా.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. సుశీల్ దాహియా, మాహిర్ మొహిద్దున్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించగా... తుషార్ కాంతి రే, విశాల్ సిన్హాలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. హేమాల్ కొఠారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. హిందీ, తెలుగు, తమిళంలో నవంబర్ 28వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తేరే ఇష్క్ మే బడ్జెట్ ఎంత? తేరే ఇష్క్ మే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తేరే ఇష్క్ మే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ధనుష్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
తేరే ఇష్క్ మే బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 90 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ముంబైతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ధనుష్ మూవీ షూటింగ్ జరుపుకుంది. తేరే ఇష్క్ మే బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది.

తేరే ఇష్క్ మే కలెక్షన్స్
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో తేరే ఇష్క్ మే మూవీకి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు లాంగ్ గ్యాప్ తర్వాత ధనుష్ హిందీలో నటిస్తుండటంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తగినట్లుగానే తేరే ఇస్క్ మై మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మరేపింది. రిలీజ్ రోజుకు ముందే ప్రీ సేల్స్‌లో ఏకంగా 2.4 లక్షల టికెట్లు అమ్ముడై ట్రేడ్ వర్గాలను సైతం ఈ సినిమా ఆశ్చర్యపరిచింది.
అడ్వాన్స్ బుకింగ్ ద్వారా తేరే ఇష్క్ మై మూవీకి ఇండియాలో 5.6 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో హిందీ నుంచి ఏకంగా 53 కోట్ల రూపాయలు, తమిళం నుంచి 3.4 కోట్ల రూపాయలు రాబట్టింది. హిందీలో 2.14 లక్షల టికెట్లు అమ్ముడవ్వగా... తమిళంలో 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా 2.4 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పార్ (1.15 లక్షలు), అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్ఎల్‌బీ 3 (1.2 లక్షలు) టికెట్ సేల్స్‌ను అధిగమించింది.
తేరే ఇష్క్ మే తొలి రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్‌లోనే సత్తా చాటిన తేరే ఇష్క్ మేకు తొలి రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు హిందీ వెర్షన్‌లో 19 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. హిందీ వెర్షన్‌లో 1195 షోలు, ముంబైలో 896 షోలు, అహ్మదాబాద్‌లో 518 షోలు, పుణేలో 407 షోలు, హైదరాబాద్‌లో 250 షోలు ప్రదర్శితమయ్యాయి.
ఇక తమిళ వెర్షన్‌లో తొలిరోజు సాయంత్రం 4 గంటల వరకు 22 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. కడపటి సమాచారం అందిన వరకు తమిళ వెర్షన్‌లో చెన్నైలో 109 షోలు, బెంగళూరులో 127 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ నివేదించింది. అడ్వాన్స్ బుకింగ్‌లోనే 5.6 కోట్లు రాబట్టిన తేరే ఇష్క్ మే సినిమా తొలిరోజు హిందీలో 12 కోట్ల రూపాయలు, తమిళంలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 20 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











