Tere Ishk Mein Day 2 Collections: రెండో రోజు ధనుష్ విధ్వంసం.. 50 కోట్ల కలెక్షన్స్ దిశగా తేరే ఇష్క్ మే

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చాలా రోజుల తర్వాత హిందీలో నటించిన చిత్రం తేరే ఇష్క్ మే. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కృతిసనన్ హీరోయిన్‌గా నటించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరిస్ ఫిలింస్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృషాన్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మించారు. సుశీల్ దాహియా, మాహిర్ మొహిద్దున్‌, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.

ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు... తుషార్ కాంతి రే, విశాల్ సిన్హాలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. హేమాల్ కొఠారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో నవంబర్ 28వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తేరే ఇష్క్ మే బడ్జెట్ ఎంత? తేరే ఇష్క్ మే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తేరే ఇష్క్ మే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ధనుష్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

Tere Ishk Mein Day 2 Expected Box Office Collections Worldwide Dhanush s Movie heading towards 50 crores mark

తేరే ఇష్క్ మే బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 90 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ముంబైతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ధనుష్ మూవీ షూటింగ్ జరుపుకుంది. తేరే ఇష్క్ మే బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది.

తేరే ఇష్క్ మే తొలి రోజు కలెక్షన్స్
ఈ సినిమాకు తొలి రోజున రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇండియాలో 16 కోట్ల రూపాయల నెట్... 19 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ధనుష్ మూవీ ఒక్క హిందీలోనే 15.25 కోట్ల రూపాయలు రాబట్టగా.. తమిళనాడులో 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. తద్వారా కెరీర్‌లోనే ఇండియా వైడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నారు ధనుష్. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో కుబేరా చిత్రం హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. కుబేరా మూవీ ఫస్ట్ డే 14.75 కోట్ల రూపాయలు రాబట్టగా.. దానిని తేరే ఇష్క్ మే అధిగమించింది. ఇక ఓవర్సీస్‌లో ధనుష్ మూవీకి ప్రీమియర్స్‌‌తో కలిపి తొలి రోజున 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఓవరాల్‌గా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది తేరే మేరే ఇష్క్.

తేరే ఇష్క్ మే రికార్డులు
అంతేకాదు.. తొలిరోజు కలెక్షన్స్ పరంగా ఏకంగా 33 హిందీ చిత్రాలను అధిగమించాడు ధనుష్. వీటిలో దే దే ప్యార్ దే 2 (9.45 కోట్ల రూపాయలు), ఏక్ దీవానీ కీ దివానియాత్ (10.1 కోట్ల రూపాయలు), సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (10.11 కోట్ల రూపాయలు), జాలీ ఎల్ఎల్‌బీ 3 (12.3 కోట్ల రూపాయలు), భాఘీ (13.2 కోట్ల రూపాయలు) చిత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. తొలిరోజు బుక్ మై షోలో 263k టికెట్ సేల్స్‌ను నమోదు చేసి.. జాలీ ఎల్ఎల్‌బీ 3(235K), సితారే జామీన్ పార్ (225K) రికార్డులను అధిగమించింది.

తేరే ఇష్క్ మే రెండో రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో రెండో రోజు కూడా ధనుష్, కృతిసనన్‌ల ప్రేమకథా చిత్రానికి మంచి బుకింగ్స్ జరిగాయి. కొన్ని ఏరియాలలో తొలిరోజును మించి సేల్స్ జరుగుతున్నట్లుగా ట్రెండ్స్ చెబుతున్నాయి. రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు ధనుష్ మూవీకి హిందీ వెర్షన్‌లో 13 శాతం, తమిళ వెర్షన్‌లో 16 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి వీకెండ్ మొదలు కానుండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ జోరందుకుంటాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

దాంతో రెండో రోజున తేరే ఇష్క్ మే చిత్రం హిందీలో 17 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 23 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో ధనుష్ మూవీ రెండ్రోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X