Tere Ishk Mein Day 3 Collections: ధనుష్ సునామీ... తేరే ఇష్క్ మే మూవీకి భారీ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కృతిసనన్ జంటగా నటించిన తేరే ఇష్క్ మే మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంతో కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ధనుష్.. భారీ టార్గెట్‌పై కన్నేశాడు. ఇదే ఊపులో వెళితే ధనుష్.. ఈజీగా 100 కోట్లు దాటేస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో నవంబర్ 28వ తేదీన తేరే ఇష్క్ మే మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తేరే ఇష్క్ మే బడ్జెట్ ఎంత? తేరే ఇష్క్ మే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తేరే ఇష్క్ మే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు ధనుష్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన తేరే ఇష్క్ మే మూవీని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరిస్ ఫిలింస్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృషాన్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మించారు. సుశీల్ దాహియా, మాహిర్ మొహిద్దున్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు... తుషార్ కాంతి రే, విశాల్ సిన్హాలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. హేమాల్ కొఠారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 90 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తేరే ఇష్క్ మే బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

తేరే ఇష్క్ మే రెండు రోజుల కలెక్షన్స్
తేరే ఇష్క్ మే మూవీకి ఇండియా వైడ్‌గా తొలి రోజున 16 కోట్ల రూపాయలు, రెండో రోజున 17 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో రెండ్రోజుల్లోనే ఇండియాలో 33 కోట్ల రూపాయల నికర వసూళ్లు.. 39 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. హిందీలో తొలి రోజున 15.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 16.25 కోట్ల రూపాయలు చొప్పున 31.50 కోట్ల రూపాయలు రాబట్టింది. తమిళంలో తొలి రోజున 75 లక్షల రూపాయలు, రెండో రోజున 75 లక్షల రూపాయలు చొప్పున 1.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
తేరే ఇష్క్ మే ఓవర్సీస్ కలెక్షన్స్
తేరే ఇష్క్ మే మూవీకి నార్త్ అమెరికాలో తొలి రోజున 72K డాలర్లు (భారత కరెన్సీలో 64.33 లక్షల రూపాయలు) వసూలైంది. రెండో రోజు సాయంత్రం 7 గంటల వరకు 58K డాలర్లు (భారత కరెన్సీలో 51.82 లక్షల రూపాయలు) రాబట్టింది. కడపటి వార్తలు అందేసరికి నార్త్ అమెరికాలో ధనుష్ మూవీకి కోటి 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో మరో కోటి 80 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఓవర్సీస్ నుంచి తేరే ఇష్క్ మే మూవీ 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ధనుష్, కృతిసనన్‌ల సినిమాకు వరల్డ్ వైడ్‌గా 42 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది.
తేరే ఇష్క్ మే మూడో రోజు కలెక్షన్స్
ధనుష్, కృతిసనన్‌ల నటన, ఆనంద్ రాయ్ టేకింగ్, పాటలతో తేరే ఇష్క్ మే మూవీకి మంచి బుకింగ్స్ జరిగాయి. వీకెండ్ కావడంతో ధనుష్ మూవీకి యువత, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. మూడో రోజు సాయంత్రం 5 గంటల వరకు తేరే ఇష్క్ మే మూవీకి హిందీ వెర్షన్‌లో 27 శాతం, తమిళ వెర్షన్‌లో 20 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. దాంతో మూడో రోజున తేరే ఇష్క్ మే చిత్రం హిందీలో 17 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 23 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో ధనుష్ మూవీ మూడు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ చేరుకుని ఓవరాల్‌గా 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











