Tere Ishk Mein Day 4 Collections: బాలీవుడ్‌లో ధనుష్ ర్యాంపేజ్... 100 కోట్లకు చేరువగా తేరే ఇష్క్ మే

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తమిళ, హిందీ భాషలలో తెరకెక్కిన చిత్రం తేరే ఇష్క్ మే. నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరిస్ ఫిలింస్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృషాన్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశీల్ దాహియా, మాహిర్ మొహిద్దున్‌, ప్రకాశ్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి... తుషార్ కాంతి రే, విశాల్ సిన్హాలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. హేమాల్ కొఠారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

వీకెండ్‌లో వసూళ్ల వర్షం కురిపించడంతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల రికార్డులను బద్ధలు కొట్టిన తేరే ఇష్క్ మే మూవీ.. సోమవారం నాటి టెస్టులో పాసైందా? వీకెండ్ మాదిరిగానే కలెక్షన్స్ రాబడుతుందా? లేదా? అని ట్రేడ్ పండితులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తేరే ఇష్క్ మే బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు ధనుష్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

Tere Ishk Mein Day 4 Expected Box Office Collections Worldwide Dhanush s Movie heading towards 100 crores mile stone

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 90 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తేరే ఇష్క్ మే బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

తేరే ఇష్క్ మే మూడు రోజుల కలెక్షన్స్
తేరే ఇష్క్ మే మూవీకి ఇండియా వైడ్‌గా తొలి రోజున 16 కోట్ల రూపాయలు, రెండో రోజున 17 కోట్ల రూపాయలు, మూడు రోజున 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో మూడు రోజుల్లోనే ఇండియాలో 52 కోట్ల రూపాయల నికర వసూళ్లు.. 62 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. హిందీలో తొలి రోజున 15.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 16.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 18.25 కోట్ల రూపాయలు చొప్పున 49.75 కోట్ల రూపాయలు రాబట్టింది. తమిళంలో తొలి రోజున 75 లక్షల రూపాయలు, రెండో రోజున 75 లక్షల రూపాయలు, మూడో రోజున 75 లక్షల రూపాయలు చొప్పున 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తేరే ఇష్క్ మే ఓవర్సీస్ కలెక్షన్స్
భారత్‌తో పాటే ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శనివారం వరకు నార్త్ అమెరికాలో తేరే ఇష్క్ మే మూవీకి 145K (1.29 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఆదివారం నాటి వసూళ్లతో కలిపి యూఎస్ఏ, కెనడాలలో ధనుష్ మూవీ 2.50 కోట్ల రూపాయలకు పైగా రాబట్ట వచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, కెనడా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో మరో 3.50 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దాంతో మూడు రోజుల వరకు తేరే ఇష్క్ మే మూవీకి ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్‌ కలెక్షన్స్ కలిపి ధనుష్ మూవీకి ఇప్పటి వరకు 68 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తేరే ఇష్క్ మే నాలుగో రోజు కలెక్షన్స్
ధనుష్, కృతిసనన్‌ల ప్రేమ కథా చిత్రం మండే టెస్ట్ కూడా పాసైంది. వర్కింగ్ డే అయినప్పటికీ నాలుగో రోజైన సోమవారం ఈ సినిమాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాలలో తేరే ఇష్క్ మే మూవీకి వెన్నెముకలా నిలుస్తోంది. 4వ రోజు సాయంత్రం 7 గంటల వరకు ఈ మూవీకి హిందీలో 14 శాతం, తమిళంలో 16 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది.

దాంతో ధనుష్- కృతిసనన్‌ల మూవీకి నాలుగో రోజు హిందీలో 5 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 8 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ కలెక్షన్స్‌తో కలిపి తేరే ఇష్క్ మే మూవీ 4 రోజుల్లో 80 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ధనుష్ జోరు ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోపే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X