TBMAUJ Collections 100 కోట్లకు చేరువగా కృతిసనన్ మూవీ.. 8 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు షాహిద్ కపూర్, కృతిసనన్ జంటగా నటించిన తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. అమిత్ జోష్, ఆరాధన షా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దినేష్ విజాన్, లక్ష్మణ్ ఉటేకర్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్ల మార్క్‌కు చేరువైంది. గత 8 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రేమకథా చిత్రంగా రూపొందిన తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా మూవీలో ధర్మేంద్ర, డింపుల్ కపాడియా లాంటి లెజెండరీ యాక్టర్లు నటించారు. యువ, సీనియర్ల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రాన్ని సుమారుగా 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ఇండియాలో 2500 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లలో విడుదల చేయడం జరిగింది.

తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా చిత్రానికి తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో కొనసాగుతున్నది. ఈ సినిమా తొలి రోజు హిందీలో 7 కోట్ల రూపాయలు నికరంగా, ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు కంటే రెండో రోజు అధికంగా ఇండియాలో 10 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక మూడో రోజు ఈ చిత్రం అత్యధికంగా 12 కోట్ల రూపాయలు రాబట్టింది.
Recommended Video

తొలి వారాంతం తర్వాత ఈ మూవీ భారీగా పడిపోయింది. 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయలు, 8వ రోజు 4.5 కోట్లు, 6వ రోజు 7.5 కోట్ల రూపాయలు, 7వ రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఈ చిత్రం 47 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా సినిమాకు ఓవర్సీస్‌లో మంచి స్పందనతోపాటు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం యూకే, యూఎస్ఏ, గల్ఫ్ దేశాల్లో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో 25 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 85 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.
ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 95 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఈ చిత్రం 84 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే ఇంకా ఈ సినిమా 11 కోట్ల రూపాయలు రాబట్టాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











