Teri Baaton Mein Closing Collections: షాహిద్ మూవీ బడ్జెట్ 85 కోట్లు.. కృతిసనన్ సినిమాకు ఎన్ని కోట్ల లాభమంటే?
హిందీ సినీ స్టార్ హీరో షాహిద్ కపూర్, యంగ్ హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించిన తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా. అమిత్ జోష్, ఆరాధన షా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దినేష్ విజాన్, లక్ష్మణ్ ఉటేకర్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ సినిమా మొదట ఫ్లాప్ టాక్ సంపాదించుకొన్నప్పటికీ.. మౌత్ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ సాధించిందా? అనే వివరాల్లోకి వెళితే..
తేరి బాతోంమే ఐసా ఉల్జా జియా సినిమాలో స్టార్ యాక్టర్లు, టెక్నిషియన్స్ ఉండటంతో భారీగా బడ్జెట్ అయింది. ఈ సినిమాను సుమారుగా 85 కోట్లకుపైగా రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 80 కోట్లుగా వాల్యూ కట్టారు.

షాహిద్ కపూర్, కృతిసనన్ క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతోపాటు ప్రమోషన్స్ కార్యక్రమాలకు మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాను ఇండియాలో 2000 స్క్రీన్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దాంతో మంచి ఓపెనింగ్స్ కూడా సాధించింది.
కబీర్ ఖాన్ తర్వాత అంతటి క్రేజ్‌తో షాహీద్ కపూర్ మూవీ రిలీజ్ కావడంతో తొలి రోజు 7 కోట్ల మేర వసూళ్లను సాధించింది. తొలివారం ముగిసే సమయానికి ఇండియాలో ఈ చిత్రం 44.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండోవారంలో ఈ మూవీ 22 కోట్లు, మూడో వారంలో 10 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా ఇండియాలో గత 25 రోజుల్లో 80 కోట్ల నికర వసూళ్లను సాధించింది.

ఇక ఈ మూవీ ఓవర్సీస్‌లో కూడా భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, గల్ప్, యూఏఈ లాంటి నగరాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్లు అంటే.. 45 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా తేరి బాతోంమే ఐసా ఉల్జా జియా చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 80 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 45 కోట్లకుపైగా రూపాయలను వసూలు చేసింది. అంటే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 125 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఇటీవల కాలంలో భారీ లాభాలను సంపాదించిన బాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా రికార్డుల్లోకి ఎక్కింది.


Click it and Unblock the Notifications











