Teri Baaton Mein Aisa Uljha Jiya Day 2 Collections షాహిద్ కపూర్ మూవీకి భారీ కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ యువ దర్శకుడు అమిత్ జోషి డైరెక్షన్‌లో మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తేరి బాతో మే ఐసా ఉల్జా జియా. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఇండియన్ లెజెండరీ యాక్టర్లు ధర్మేంధ్ర, డింపుల్ కాపాడియా కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, అడ్వాన్స్ బుకింగ్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తేరి బాతో మే ఐసా ఉల్జా జియా సినిమా బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ రావడంతో ఇండియాలో 2000 స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3000 స్క్రీన్లలో విడుదల చేశారు.

తేరి బాతో మే ఐసా ఉల్జా జియా సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో హిందీ వెర్షన్ 7 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో సుమారుగా 5.7 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే షాహిద్ గత సినిమాలతో పోల్చుకొంటే ఈ చిత్రం కొంచెం తక్కువగానే వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తేరి బాతో మే ఐసా ఉల్జా జియా చిత్రం రెండో రోజు కూడా స్టడీగా కలెక్షన్లను నమోదు చేసింది. ఇండియాలో 12 కోట్లు నికర వసూళ్లు, ఓవర్సీస్‌లో మరో 5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా చిత్రం మూడో రోజు కూడా స్టడీగానే వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 2 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద హిందీలో 17 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక 3 రోజు ఈ మూవీ హిందీలో 12 కోట్ల కలెక్షన్లు. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 52 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

షాహిద్ కపూర్, కృతిసనన్ జంటగా నటించిన తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 80 కోట్ల షేర్ 160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల జోష్ కొనసాగితే ఈ సినిమా త్వరలోనే బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











