Test Movie Review: టెస్ట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్, మీరా జాస్మిన్, కాళీ వెంకట్, నాజర్, వినయ్ వర్మ తదితరులు
రచన, దర్శకత్వం: ఎస్ శశికాంత్
నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్ శశికాంత్
సినిమాటోగ్రఫి: విరాజ్ సింగ్ గోహిల్
ఎడిటింగ్: టీఎస్ సురేష్
మ్యూజిక్: శక్తిశ్రీ గోపాలన్
బ్యానర్: వైనాట్ స్టూడియోస్
ఓటీటీ రిలీజ్: వై నాట్ స్టూడియోస్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-04-04

అర్జున్ వెంకట్రామన్ (సిద్దార్థ్) భారత జట్టుకు ఆడే టాప్ టెస్ట్ క్రికెటర్. భార్య పద్మ (మీరా జాస్మిన్), కొడుకు ఆది (లిరిష్ రాఘవ్)తో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ప్రొఫెషనల్ కెరీర్ చివరి దశలో ఫామ్ కోల్పోయి అనేక విమర్శలకు గురి అవుతుంటాడు. అర్జున్ క్లాస్‌మెట్ కుముద (నయనతార), శరవణన్ భార్యభర్తలు. అర్జున్ కుమారుడు ఆది చదివే స్కూల్‌లో కుముద టీచర్. నీటి ద్వారా పవర్ క్రియేట్ చేసి పెట్రోల్ లేకుండా వాహనాలు నడిపే ఫార్మూలాను కనిపెట్టిన సైంటిస్ట్ శరవణన్. కుముద, శరవణన్ సంతానం లేక ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడానికి సిద్దమవుతారు. ఈ క్రమంలో అర్జున్ కుమారుడు ఆదిని శరవణన్ కిడ్నాప్ చేస్తాడు.

Test Tamil Movie Review in Telugu

ఫామ్ కోల్పోయి సొంత గడ్డపై తనకు తాను నిరూపించుకొనే ఛాన్స్ దొరుకుందా? లేదా? అనే డౌట్‌తో ఉన్న అర్జున్‌కు టెస్ట్‌లో అవకాశం లభించిందా? తన ప్రయోగాన్ని నిరూపించుకోవడానికి సైంటిస్ట్ శరవణన్ ఎలాంటి కష్టాలు పడ్డాడు? తన టాలెంట్ ప్రపంచానికి పరిచయం చేయడానికి లక్షల అప్పులు ఎందుకు చేశాడు? భార్యకు తెలియకుండా 50 లక్షల అప్పు చేసిన శరవణన్ ఎలాంటి సమస్యలకు గురి అయ్యాడు. ఐవీఎఫ్ ద్వారా సంతానం ప్రయత్నించిన కుముద ప్రయత్నం సఫలమైందా? చివరి టెస్ట్‌గా భావించి ఆడుతున్న అర్జున్‌కు బెట్టింగ్ భూతం ఎలా బెదిరించింది? టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అర్జున్‌ సమయంలో కొడుకును శరవణన్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? అర్జున్ చివరి టెస్ట్ అటు శరవణన్, ఇటు బెట్టింగ్ కింగ్ ధర్మేష్ (వినయ్ వర్మ)కు ఎలాంటి పరీక్ష పెట్టింది? అర్జున్, ఆది, పద్మ, శరవణన్, కుముద, ధర్మేష్ జీవితాల్లో టెస్ట్ మ్యాచ్ ఎలాంటి ప్రభావం చూపించిందనే ప్రశ్నలకు సమాధానమే టెస్ట్.

టెస్ట్ సినిమా కథలో నాలుగైదు క్యారెక్టర్ల జీవితాలను ఆధారంగా చేసుకొని దర్శకుడు శశికాంత్ రాసుకొన్న పాయింట్స్ బలంగా కనిపిస్తాయి. ఒక్కో స్టోరీ థ్రెడ్‌ను స్ట్రాంగ్ సీన్లుగా విస్తరించి ఎమోషనల్‌గా కథను చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కథలోని పాత్రలకు సరైన నటీనటులను ఎంపిక చేసుకోవడమే ఈ సినిమాకు సంగం సక్సెస్ లభించిందని చెప్పవచ్చు. ఈ కథలోని పాత్రలను అర్ధం చేసుకొని దర్శకుడి విజన్‌ను ఆకళింపు చేసుకొని నటీనటులు అందించిన ఫెర్ఫార్మెన్స్‌తో సక్సెస్ పరిపూర్ణమైందనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు శశికాంత్ పాత్రలను తీర్చిదిద్దిన తీరు, నటీనటులు నుంచి ప్రతిభను తెరపైన చూపించిన తీరు ఈ సినిమాకు అత్యంత బలంగా నిలిచింది. స్క్రీన్ ప్లే, కథలో కొన్ని సన్నివేశాలను బలంగా రాసుకోకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది.

టెస్ట్ క్రికెటర్‌గా అర్జున్ వెంకట్రామన్ పాత్రలో సిద్దార్థ్ సటిల్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. కీలక సన్నివేశాల్లో బ్యాలెన్స్‌గా, ఎమోషనల్‌గా ఆకట్టుకొన్నాడు. ఇక నయనతార, ఆర్ మాధవన్ పెర్ఫార్మెన్స్‌ ఈ సినిమాకు ఓ బ్యూటీగా చెప్పుకోవచ్చు. పిల్లలు లేని భార్యగా, తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలనే భర్తగా, భిన్నాభిప్రాయాలతో జీవితం సాగించే ఈ దంపతుల మధ్య సంఘర్షణ బాగుంది. కొడుకు, భర్త మధ్య ఉండే వైరుధ్యంతో భార్య పద్మగా మీరా జాస్మిన్ గ్లామర్‌గా, ఎమోషనల్‌గా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది. బెట్టింగ్ మాఫియా నడిపే వ్యక్తిగా వినయ్ వర్మ ఆకట్టుకొన్నారు. నాజర్, కాళి వెంకట్, ఇతరులు తమ పాత్రలకు పరిధి మేరకు ఓకే అనిపించారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. శక్తిశ్రీ గోపాలన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాలోని సన్నివేశాలకు అత్యంత బలంగా నిలిచింది. చాలా సన్నివేశాలు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి. ఇక విరాజ్ సింగ్ సినిమాటోగ్రఫి బాగుంది. క్రికెట్ సన్నివేశాలు, మాధవన్, నయనతార మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లకు వాడుకొన్న లైటింగ్ బాగుంది. టీఎస్ సురేష్ ఎడిటింగ్ మైనస్. కథలో వేగం లేకపోవడం వల్ల ఎమోషన్స్ వర్కవుట్ కాలేదనిపిస్తుంది. వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి, రామచంద్ర, శశికాంత్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Test Tamil Movie Review in Telugu

ఫ్యామిలీ ఎమోషన్స్, క్రికెట్ బెట్టింగ్ అంశాలతో రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా టెస్ట్. సిద్దార్థ్, నయనతార, ఆర్ మాధవన్ ఎవరికి వారు పోటీ పడి నటించారు. స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ పాయింట్ సినిమాకు కొంత వీక్ అనిపిస్తుంది. టెక్నికల్ అంశాలు సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి. ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ఉన్న అయినప్పటికీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నది. తీరిక సమయం చూసుకొని.. ఈ సినిమాను రెండున్నర గంటలపాటు ఆస్వాదించండి.

More from Filmibeat

Read more about: test siddharth nayanthara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X