twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారి ఫ్లాపులతో....

    By Staff
    |

    Parugu
    ఈ మథ్య కాలంలో భారీ అంచనాలతో విడుదులైన సినిమాలు భాక్సాఫీస్ వద్ద అదే రేంజిలో కుప్పకూలుతున్నాయి. మొన్న వారం రిలీజయిన 'కంత్రి' కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. మెహర్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి ఆశించిన స్ధాయిలో ప్రేక్షకదారణ లభించటం లేదు. సినిమాలో ఎన్టిఆర్ డాన్స్లకు మంచి రెస్పాన్స్ వస్తున్నా స్క్రిప్టు సమస్యలతో సెకండాఫ్ చతికల పడింది. దాంతో కలెక్షన్లు నాలుగు వారాలకే పరిమితమయ్యేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఆ పై వారం రిలీజయిన అల్లు అర్జున్ 'పరుగు' సినిమా ఆదరణ అంతంత మాత్రంగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ ద్వితీయ విఘ్నం తప్పించుకోలేక పోయాడు. ఇక తెలంగాణ నేపథ్యంలో వచ్చిన 'బతుకమ్మ' బాగుందని అంటున్నా ప్రేక్షకులు మాత్రం ఆ థియోటర్లు ఉన్న వైపే చూడటం లేదు. 'ఎర్రసముద్రం' కూడా సేమ్ సిట్యువేషన్ ని ఎదుర్కొంటోంది. రెవిన్యూ పరంగా నిరాశగా మిగిలిస్తోంది.అంతకు ముందు రిలీజయిన కామిడీలుకు ('బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ ,మైఖేల్ మదన కామరాజు' ) ఈ పరిస్ధిత కలిసివస్తోంది. దాంతో అవి పబ్లిసిటి పెంచుకుని వచ్చే కలెక్షన్స్ పంచుకుంటున్నాయి. కాని 'భలేదొంగలు, కాళిదాసు, ఆటాడిస్తా' సినిమాలకు ఆ అవకాశం కూడా కనపడటం లేదు. ఈ స్థితిలో 'గమ్యం' సినిమా ఒకటే స్టడీగా ఉండి వారాంతాలు హౌస్ ఫుల్ అవుతూ వంద రోజుల వైపు దూసుకెళుతోంది. యేదేమైనా కామన్ ప్రేక్షకుడు ఫలానా సినిమా తప్పనిసరిగా చూడాలనే పరిస్థితి మాత్రం ఏ సినిమా కూడా కల్పించకపోవటం విచారకరం. ఇక డబ్బింగ్ చిత్రాలు నార్నియా,మోహిని మాత్రమే ఈ వారం రివీజయ్యాయి. అందరి ఆశలు వచ్చే వారం రిలీజయ్యే బుజ్జిగాడు మీదే ఉన్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X