Thaai Kizhavi 2 days Box Office: భారీగా తాయ్ కెలవి సినిమా కలెక్షన్లు.. రాధిక మూవీకి ఎన్ని కోట్ల వసూళ్లంటే?
తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, సుధన్ సుందరం నిర్మాతలుగా మారి ప్యాషన్ స్టూడియోస్, శివ కార్తీకేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం తాయి కెలవి. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కామెడీ, ఎమోషనల్ డ్రామాగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో సింగం పులి, రైచల్ రెబాకా, అరుళ్ దాస్, బాలా శరవణన్, ముణిశ్ కాంత్, ఇలవరసు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు సినిమాటోగ్రఫి: వివేక్ విజయ్ కుమార్, ఎడిటర్: సాన్ లోకేష్, మ్యూజిక్: నివాస్ ప్రసన్న, ప్రొడక్షన్ డిజైనర్: రాము తంగరాజ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తాయ్ కెలవి సినిమా కథ ఏమిటంటే?
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి (రాధిక శరత్ కుమార్) మరణిస్తే ఆస్తిని పంచుకోవాలనే దురాశతో కొడుకులు ఉంటారు. అయితే ఆమె దగ్గర విలువైన నిధి ఉందనే విషయం వారికి తెలుస్తుంది. తల్లి నిధిని ఎక్కడ దాచిందని వెతుకుతూ.. ఆ రహస్యాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. దాంతో తల్లిని చనిపోకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ తల్లి వద్ద నిధి రహస్యాన్ని తెలుసుకొన్నారా? తల్లి ఆ నిధులను ఎక్కడ దాచిపెట్టింది? ఆ తల్లి చివరి క్షణాలు ఎలా గడిచాయనే ఎమోషనల్ కథనే తాయి కలైవి సినిమా.
బడ్జెట్, రెమ్యునరేషన్లు
ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను శివకార్తీకేయన్ టీమ్ మీడియం రేంజ్ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 7 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 750 స్క్రీన్లలో రిలీజ్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు ఓపెనింగ్స్ కూడా సానుకూలంగా నమోదు అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తొలి రోజు కలెక్షన్లు: తాయ్ కెలవి సినిమాకు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన కనిపించింది. ఈ సినిమా తొలి రోజు 3 కోట్ల మేర వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 20 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో ఈ సినిమా 2 లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలో 3.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఒక కోటి రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది.
రెండొో రోజు కలెక్షన్ల అంచనా: దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 4.25 నుంచి 4.5 కోట్ల రూపాయల గ్రాస్, 2 కోట్లకుపైగా షేర్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి రోజు కంటే రెండో రోజు కూడా భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. రెండో రోజు ఈ సినిమా 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు అని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రెండు రోజుల్లో నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 5 కోట్ల షేర్.. 10 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











