Thaai Kizhavi Closing Collections: తాయ్ కెలవి క్లోజింగ్ కలెక్షన్స్.. రాధిక మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

ఈ ఏడాది ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తిన చిత్రం తాయ్ కెలవి. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ చిన్న సినిమా ఊహించని వసూళ్లతో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోల సినిమాలే ఫట్ అవుతున్న దశలో 63 ఏళ్ల వయసులో అలనాటి నటి రాధిక శరత్ కుమార్ మేజిక్ చేశారు. గ్రామీణ వాతావరణం, కుటుంబ అనుబంధాలు, కామెడీ ఇతివృత్తంగా తెరకెక్కిన తాయ్ కెలవికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో తాయ్ కెళవి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తాయ్ కెలవి మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? రాధిక మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాలు పరిశీలిస్తే..

శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్, పాషన్ స్టూడియోస్ బ్యానర్‌లపై కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్, సుధాన్ సుందరం సంయుక్తంగా తాయ్ కెలవి చిత్రాన్ని నిర్మించారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ఇళవరసు, మునిష్‌కాంత్, జార్జ్ మార్యాన్, వెట్టై ముత్తుకుమార్, రాయ్‌చల్ రెబాక తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాయ్ కెలవి మూవీకి వివేక్ విజయ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, సాన్ లోకేష్ ఎడిటర్‌గా పనిచేశారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన తాయ్ కెలవి మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Thaai Kizhavi Box Office Collections Worldwide Radhika Sarathkumar s film Closing Collections at Global Box Office Report

తాయ్ కెలవి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి తాయ్ కెలవి మూవీని 9 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలపరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, రగ్గడ్ లుక్‌లో రాధిక లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాయ్ కెలవి మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 450కి పైగా థియేటర్‌లలో విడుదల చేశారు.

తాయ్ కెలవి కలెక్షన్స్ ఎంత
తాయ్ కెలవి మూవీకి తొలి వారం 23.25 కోట్ల రూపాయలు, రెండో వారం 19.45 కోట్ల రూపాయలు, మూడో వారం 11.55 కోట్ల రూపాయలు, 22వ రోజున 81 లక్షల రూపాయలు, 23వ రోజున 1.82 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 56.53 కోట్ల రూపాయల నెట్... 64.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్‌లోనూ రాధికా శరత్ కుమార్ మూవీకి భారీ ఆదరణ లభించింది. నార్త్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో ఈ సినిమాకు 10.35 కోట్ల రూపాయలు వసూలైంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి తాయ్ కెలవి మూవీకి 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రాధికా శరత్ కుమార్ మూవీకి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల రూపాయలు, తమిళనాడులో 60 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.59 కోట్ల రూపాయలు, కేరళలో 52 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 84 లక్షల రూపాయలు వసూలు చేసింది.

తాయ్ కెలవికి లాభమెంత? నష్టమెంత?
ఊహించని వసూళ్లతో తాయ్ కెలవి మూవీ నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 10 కోట్ల రూపాయల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉండగా.. ఏకంగా 45 కోట్ల రూపాయల షేర్, 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి 40 కోట్ల లాభాలను అందించింది. అంటే పెట్టుబడి మీద దాదాపు 500 శాతం లాభం. ఇదికాకుండా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతకు మరిన్ని లాభాలు వస్తాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే దాదాపు 24 రోజులు కావొస్తున్నా రాధికా శరత్ కుమార్ మూవీ ఇంకా థియేటర్ల వద్ద సందడి చేస్తూనే ఉంది. ఫైనల్ రన్‌లో తాయ్ కెలవి మూవీ ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X