Thaai Kizhavi Box Office: 50 కోట్లతో తాయ్ కెలవి సంచలనం.. కొనసాగుతున్న రాధిక మూవీ బాక్సాఫీస్ జోరు

సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ తాయ్ కెలవి. గ్రామీణ వాతావరణం, కుటుంబాల మధ్య జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రంలో రాధిక 75 ఏళ్ల వృద్దురాలిగా కనిపించారు. రాధిక నటన, కామెడీ, డ్రామా అన్ని కలిసి తాయ్ కెలవి మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. తొలి రోజు నుంచి ఊహించని కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది తాయ్ కెలవి. ఓ స్టార్ హీరో రేంజ్‌లో వసూళ్లను సాధిస్తూ.. రోజు రోజుకు కలెక్షన్స్‌ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా రాధికా శరత్ కుమార్ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్, పాషన్ స్టూడియోస్ బ్యానర్‌లపై కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్, సుధాన్ సుందరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ఇళవరసు, మునిష్‌కాంత్, జార్జ్ మార్యాన్, వెట్టై ముత్తుకుమార్, రాయ్‌చల్ రెబాక తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాయ్ కెలవి మూవీకి వివేక్ విజయ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, సాన్ లోకేష్ ఎడిటర్‌గా పనిచేశారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన తాయ్ కెలవి మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాయ్ కెలవి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

Thaai Kizhavi Box Office Collections Worldwide Radikaa Sarathkumar s film crosses 50 crores mark

తాయ్ కెలవి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి తాయ్ కెలవి మూవీని 9 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలపరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, రగ్గడ్ లుక్‌లో రాధిక లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాయ్ కెలవి మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 450కి పైగా థియేటర్‌లలో విడుదల చేశారు.

తాయ్ కెలవి కలెక్షన్స్ ఎంత?
రాధికా శరత్ కుమార్ మూవీకి తొలిరోజున 2.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 6.15 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.7 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.2 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.7 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 2.55 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 4.6 కోట్ల రూపాయలు, పదో రోజున 5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 2.50 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. తద్వారా ఇండియాలో తాయ్ కెలవి మూవీకి ఇప్పటి వరకు 44.70 కోట్ల రూపాయల గ్రాస్ .. 37.90 కోట్ల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి.

ఓవర్సీస్‌లో తాయ్ కెలవి కలెక్షన్స్
భారత్‌లో సమానంగా ఓవర్సీస్‌లోనూ తాయ్ కెలవి మూవీ భారీ వసూళ్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 3 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో 2.76 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు తాయ్ కెలవి మూవీ ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 9.21 కోట్ల రూపాయలు) రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రాధికా శరత్ కుమార్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 54 కోట్ల రూపాయలు రాబట్టింది.

50 కోట్లతో తాయ్ కెలవి సంచలనం
ఇప్పటికే బ్రేక్ఈవెన్ టార్గెట్ కొట్టేసిన తాయ్ కెలవి మూవీ.. నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెడుతోంది. రాధిక జోరు ఇలాగే కొనసాగితే తాయ్ కెలవి మూవీ 75 కోట్ల రూపాయల మార్క్‌ను అవలీలగా దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 60 ఏళ్లు పై బడిన నటి .. లీడ్ రోల్‌లో నటించి ఈ స్థాయిలో విజయం సాధించడం కోలీవుడ్ హిస్టరీలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రాల్లో పరాశక్తి 85 కోట్ల రూపాయల వసూళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. తదుపరి ప్లేస్‌లో తాయ్ కెలవి ఉండటం విశేషం. మరి రానున్న రోజుల్లో రాధిక ఎలాంటి సంచలనాలు సృస్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X