Thaai Kizhavi Day 1 Collections: తాయ్ కెలవికి ఊహించని కలెక్షన్స్.. రాధిక శరత్ కుమార్ మూవీకి ఫస్ట్ డే ఎంతంటే?

80, 90 దశకాల్లో దక్షిణాదిన అగ్రనటిగా వెలుగొందారు రాధికా శరత్ కుమార్. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి వెండితెరపై ఎన్నో మరపురాని పాత్రలను పోషించారు. బుల్లితెరపైనా స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేశారు రాధిక. 60 ప్లస్‌లోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. చాలాకాలం తర్వాత రాధిక లీడ్ రోల్‌లో నటించిన మూవీ తాయ్ కెలవి. ఫిబ్రవరి 27వ తేదీన ఈ సినిమా తమిళంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాయ్ కెలవి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

తాయ్ కెలవి తారాగణం
తాయ్ కెలవి చిత్రాన్ని శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్, పాషన్ స్టూడియోస్ బ్యానర్‌లపై కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్, సుధాన్ సుందరం సంయుక్తం నిర్మించగా... శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ఇళవరసు, మునిష్‌కాంత్, జార్జ్ మార్యాన్, వెట్టై ముత్తుకుమార్, రాయ్‌చల్ రెబాక తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాయ్ కెలవి మూవీకి వివేక్ విజయ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, సాన్ లోకేష్ ఎడిటర్‌గా పనిచేశారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.

Thaai Kizhavi Day 1 Expected Box Office Collections Worldwide Radikaa Sarathkumar s film good start at GBOC

తాయ్ కెలవి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి తాయ్ కెలవి మూవీని 12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలపరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, రగ్గడ్ లుక్‌లో రాధిక లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాయ్ కెలవి మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13 కోట్ల రూపాయల షేర్.. 26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 450కి పైగా థియేటర్‌లలో విడుదల చేశారు.

తాయ్ కెలవి ప్రీమియర్స్‌కి రెస్పాన్స్
ఈ సినిమాను ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను అహింస ఎంటర్‌టైన్‌మెంట్ దక్కించుకోగా.. శ్రీలంకలో జిన్‌ఫిక్స్, మిడిల్ ఈస్ట్‌లో పీహచ్ఎఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో డ్రీమ్ స్క్రీన్స్ ఇంటర్నేషనల్, ఫ్రాన్స్‌లో 180 ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేసింది. ఓవర్సీస్‌లోనూ రాధికా శరత్ కుమార్ మూవీకి మంచి ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన ప్రదర్శించిన ప్రీమియర్స్‌లో పాజిటివ్ టాక్ వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది.

తాయ్ కెలవి తొలిరోజు కలెక్షన్స్
తాయ్ కెలవి మూవీకి చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరునల్వేలి ఏరియాలలో మంచి ఆక్యూపెన్సీ నమోదవుతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు రాధికా శరత్ కుమార్ మూవీకి ఇండియాలో 22 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ చెబుతోంది. ఇప్పటి వరకు చెన్నైలో 363 షోలు, బెంగళూరులో 14 షోలు, కోయంబత్తూరులో 116 షోలు, మధురైలో 53 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. కడపటి వార్తలు అందేసరికి రాధికా శరత్ కుమార్ మూవీకి ఇండియాలో 83 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా తొలిరోజు తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X