Thaai Kizhavi 3 days Box Office: వీకెండ్‌లో అదరగొట్టిన తాయ్ కెలవి .. రాధిక మూవీకి ఎన్ని కోట్లంటే?
Thaai Kizhavi Box Office: తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, సుధన్ సుందరం కలిసి ప్యాషన్ స్టూడియోస్, శివ కార్తీకేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించిన సినిమా 'తాయి కెలవి'. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ కామెడీతో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించగా, సింగం పులి, రైచల్ రెబాకా, అరుళ్ దాస్, బాలా శరవణన్, మునీశ్ కాంత్, ఇలవరసు తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
సినిమాటోగ్రఫీని వివేక్ విజయ్ కుమార్, ఎడిటింగ్‌ను సాన్ లోకేష్, సంగీతాన్ని నివాస్ ప్రసన్న అందించారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను రాము తంగరాజ్ నిర్వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కథ ఏమిటంటే?
'తాయి కెలవి' కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి (రాధిక శరత్ కుమార్) మరణిస్తే ఆస్తి పంచుకోవాలనే ఆశతో ఉన్న కొడుకులు, ఆమె దగ్గర విలువైన నిధి ఉందనే విషయం తెలుసుకుంటారు. ఆ నిధి ఎక్కడ దాచిందో తెలుసుకోవాలనే ఆత్రంతో తల్లిని చనిపోకుండా చూసుకోవడం ప్రారంభిస్తారు. తల్లి నిజంగా నిధిని దాచిందా? ఉంటే అది ఎక్కడ? ఆ చివరి రోజుల్లో తల్లి-కొడుకుల మధ్య జరిగిన సంఘటనలు ఎలా మార్పు తీసుకొచ్చాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. కామెడీ ముసుగులో కుటుంబ బంధాల విలువను చూపించే ప్రయత్నం దర్శకుడు చేశారని తెలుస్తోంది.
బడ్జెట్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను మితమైన బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల పారితోషికాలు, సాంకేతిక ఖర్చులు, ప్రమోషన్లతో కలిపి సుమారు రూ.7 కోట్ల వరకు వ్యయం జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.5 కోట్ల షేర్, రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 750 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు ఓపెనింగ్స్ కూడా సానుకూలంగా నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తాయ్ కెలవి వసూళ్లను చూస్తే.. ఈ మూవీ సర్ప్రైజ్ హిట్ అనే చెప్పాలి. ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ తమిళ కామెడీ డ్రామా. తొలి రోజు పాజిటివ్ టాక్ అందుకుని , దీనికి తోడు పాజిటివ్ రివ్యూలు, స్ట్రాంగ్ కంటెంట్, మౌత్ పబ్లిక్ సిటీ కలిసి రెండో రోజే బాక్సాఫీస్ వద్ద భారీ జంప్ నమోదు చేసింది. ఈ సినిమాకు కలెక్షన్లు గణనీయంగా పెరిగాయి. మొదటి రోజు ఈ మూవీ రూ. 2. 65 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఓపెనింగ్ రోజు మంచి స్టార్ట్ ఇచ్చిన ఈ సినిమా.. శనివారం వచ్చిన మౌత్ టాక్‌తో కలెక్షన్స్ మరింత పెరిగాయి.
రెండో రోజు మార్నింగ్ షోలలో 22% ఆక్యుపెన్సీ నమోదవగా, మధ్యాహ్నం షోలలో అది 45 శాతానికి పెరిగింది. సాయంత్రం 52 శాతానికి చేరిన ఆక్యుపెన్సీ, నైట్ షోలలో 67 శాతానికి చేరింది. ఇలా రెండో రోజు సగటు ఆక్యుపెన్సీ 46 శాతంగా నమోదైంది. ఈ జోష్ కారణంగా రెండో రోజు సుమారు రూ. 4. 65 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే ఇది సుమారు 75.47 శాతం పెరుగుదల. రెండు రోజుల కలిపి ఈ మూవీకి రూ. 7. 3 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేయగా, గ్రాస్ పరంగా అది సుమారు రూ. 8. 61 కోట్లకు చేరినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మూడో రోజు కలెక్షన్ల అంచనా..
ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను పరిశీలిస్తే.. ఆదివారం అయిన మూడో రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. డే 3లో రూ.5 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ మొత్తం రూ.12 నుంచి 13 కోట్ల నెట్ రేంజ్‌లో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నేడు బ్రేక్ ఈవింగ్ టార్గెట్ ను కూడా క్రాస్ చేసే అవకాశముంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మొదటి వారంలో రూ. 20 కోట్ల మార్క్ దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
చిన్న బడ్జెట్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్ రావడం విశేషంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రాధిక సరత్‌కుమార్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించడం సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. భావోద్వేగాలతో కూడిన కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, 'తాయ్ కెలవి' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











