Thaai Kizhavi Day 4 Collections: తాయ్ కెలవి వసూళ్ల సంచలనం.. 4 రోజుల్లో రాధికా శరత్ కుమార్ ఎంత రాబట్టిందంటే?
కోలీవుడ్ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ నటించిన చిత్రం తాయ్ కెలవి. శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్, పాషన్ స్టూడియోస్ బ్యానర్‌లపై కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్, సుధాన్ సుందరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తొలి రోజు నుంచి ఊహించని కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది తాయ్ కెలవి. ఓ స్టార్ హీరో రేంజ్‌లో వసూళ్లను సాధిస్తూ.. రోజు రోజుకు కలెక్షన్స్‌ను పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో తాయ్ కెలవి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..
సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ఇళవరసు, మునిష్‌కాంత్, జార్జ్ మార్యాన్, వెట్టై ముత్తుకుమార్, రాయ్‌చల్ రెబాక తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాయ్ కెలవి మూవీకి వివేక్ విజయ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, సాన్ లోకేష్ ఎడిటర్‌గా పనిచేశారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన తాయ్ కెలవి మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

తాయ్ కెలవి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి తాయ్ కెలవి మూవీని 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలపరంగా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, రగ్గడ్ లుక్‌లో రాధిక లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాయ్ కెలవి మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 11 కోట్ల రూపాయల షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 450కి పైగా థియేటర్‌లలో విడుదల చేశారు.
తాయ్ కెలవి మూడు రోజుల కలెక్షన్స్
రాధికా శరత్ కుమార్ మూవీకి తొలిరోజున 2.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 6.15 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. తద్వారా ఇండియాలో మూడు రోజుల వరకు 13.8 కోట్ల రూపాయల నెట్.. 16.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు తాయ్ కెలవి మూవీ కర్ణాటకలో 1.35 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల రూపాయలు, తమిళనాడులో 14.5 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 23 లక్షల రూపాయలు చొప్పున గ్రాస్ రాబట్టింది.
తాయ్ కెలవి ఓవర్సీస్ కలెక్షన్స్
భారత్‌తో సమానంగా ఓవర్సీస్‌లో రాధికా శరత్ కుమార్ మూవీ భారీ వసూళ్లను సాధిస్తోంది. నార్త్ అమెరికాతో పాటు యూకే, యూరప్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 6,01,273 డాలర్లు (భారత కరెన్సీలో 5.50 కోట్ల రూపాయలు) కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించింది. భారత్‌లో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి తాయ్ కెలవి మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.
తాయ్ కెలవి నాలుగో రోజు వసూళ్ల అంచనా
వీకెండ్ వరకు ఎదురులేకుండా వసూళ్లు సాధించిన తాయ్ కెలవి మూవీకి ఈరోజు నుంచి పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి తమిళనాడులో 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. దానికి తోడు వర్కింగ్ డేస్ కావడంతో రాధికా శరత్ కుమార్ ఈ టెస్ట్‌ను ఎలా పాస్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియా వైడ్‌గా తాయ్ కెలవి మూవీకి 63 లక్షల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు ఈ సినిమాకు తమిళనాడులో 2.50 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయల చొప్పున ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసిన తాయ్ కెలవి మూవీ ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టేసింది.


Click it and Unblock the Notifications











