Thalaivan Thalaivii Box Office Day 2: తలైవన్ తలైవి కలెక్షన్స్.. విజయ్ సేతుపతి మూవీకి ఎన్ని కోట్లంటే?
హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు విజయ్ సేతుపతి. మహారాజతో బాక్సాఫీస్‌ను వణికించిన విజయ్‌కి ఇప్పుడు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా విజయ్ సేతుపతి నటించిన చిత్రం తలైవన్ తలైవి. నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్, టీజీ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మించారు.
తలైవన్ తలైవి చిత్రంలో యోగిబాబు, రోషిణి హరిప్రియన్, కాళి వెంకట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎం సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రదీప్ ఈ రాఘవన్ ఎడిటింగ్ .. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చారు. జూలై 25వ తేదీన తలైవన్ తలైవి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? రెండవ రోజు వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

తలైవన్ తలైవి బడ్జెట్ ఎంత?
చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు అందమైన లోకేషన్స్‌లో తలైవన్ తలైవి చిత్రాన్ని చిత్రీకరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాల ఖర్చు కలిపి తలైవన్ తలైవి చిత్రానికి దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ సేతుపతి - నిత్యామీనన్ కాంబోతో పాటు టీజర్, ట్రైలర్లు, పాటలతో ఈ సినిమాపై కోలీవుడ్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తలైవన్ తలైవి మూవీ తమిళం, తెలుగు, ఓవర్సీస్‌లో మంచి బిజినెస్ చేసింది.
తలైవన్ తలైవి బిజినెస్ ఎంత?
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను విజయ్ టీవీ, కలర్స్ తమిళ్ సొంతం చేసుకున్నాయి. విజయ్ సేతుపతి చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను దాదాపు 1000 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
తలైవన్ తలైవి తొలిరోజు కలెక్షన్స్
విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్స్ చూస్తే.. మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు ఇండియా వైడ్‌గా 4.15 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ సినిమా విడుదల అనూహ్యంగా వాయిదా పడటం వసూళ్లపై పెను ప్రభావం చూపింది. లేని పక్షంలో తలైవన్ తలైవి చిత్రం ఫస్ట్ డే 10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
తలైవన్ తలైవి రెండో రోజు కలెక్షన్స్
రెండో రోజు విజయ్ సేతుపతి చిత్రానికి బుకింగ్స్ పెరిగాయి. సాయంత్రం 4 గంటల వరకు ఏకంగా 52.24 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీని నమోదు చేసినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. వీకెండ్ కావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా రెండు రోజు తలైవన్ తలైవి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి విజయ్ సేతుపతి ఎలాంటి మేజిక్ చేస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











