Thalaivan Thalaivii Box Office Day 3: తలైవన్ తలైవి కలెక్షన్స్.. విజయ్ సేతుపతి మూవీకి 3వ రోజు ఎంతంటే?

పాండిరాజా దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన చిత్రం తలైవన్ తలైవి. ఈ చిత్రంలో విజయ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాను సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్, టీజీ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మించారు. జూలై 25న తలైవన్ తలైవి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 3వ రోజు వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

తలైవన్ తలైవి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చు కలిపి తలైవన్ తలైవి చిత్రానికి దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ సేతుపతి ఇమేజ్, తలైవన్ తలైవిలోని పాటలతో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను విజయ్ టీవీ, కలర్స్ తమిళ్ సొంతం చేసుకున్నాయి. తలైవన్ తలైవి చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను దాదాపు 1000 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

Thalaivan Thalaivii Day 3 Expected Box Office Collections Worldwide Vijay Sethupathi Movie get good Numbers

తలైవన్ తలైవి రెండు రోజుల కలెక్షన్స్
విజయ్ సేతుపతి మూవీ కలెక్షన్స్ చూస్తే.. పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచి పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు విజయ్ సేతుపతి చిత్రం ఇండియా వైడ్‌గా 4.15 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు రూ. 6.75 కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. కరోనా తర్వాత విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో 4వ స్థానంలో నిలిచింది. విడుదలైకి రూ.7.5 కోట్లు, కథువకులై రెండు కాదల్ రూ.6.45 కోట్లు, మహారాజా రూ.4.7 కోట్లు సాధించింది.

తలైవన్ తలైవి మూడో రోజు కలెక్షన్స్
పాజిటివ్ మౌత్ టాక్‌తో రోజు రోజుకు ఈ సినిమాకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాలలో మంచి బుకింగ్స్ నమోదవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మూడో రోజు సాయంత్రం 5 గంటల వరకు తలైవన్ తలైవికి 64.75 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. ఆదివారం కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. దీంతో మూడో రోజు ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ నమోదైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మూడో రోజు విజయ్ సేతుపతి మూవీ వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు. ఇదే స్పీడు కంటిన్యూ చేస్తే వారం రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి తలైవన్ తలైవిలు ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X